తెలంగాణ రాష్ట్ర సమితి పొట్టిగా చెబితే టీఆర్ ఎస్. ఉద్యమ పార్టీలో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండటమే కాదు.. రాజకీయ పార్టీకి ఉండాల్సినవన్నీ ఆ పార్టీ పుణికి పుచ్చుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే కాదు.. ఆ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు మంచి వాగ్దాటి ఉన్న వారే. కేసీఆర్ స్థాయిలో కాకున్నా.. కాస్త అటూఇటూగా ఆ స్థాయిలో మాటలతో నిప్పులు చెరిగేవారే. అలాంటి వారిలో ఒకరిగా చెప్పాలి ఎంపీ వినోద్ కుమార్.
ఢిల్లీ గడ్డ మీద ఆంధ్రా మీద.. ఆంధ్రా నాయకత్వం మీద ఆయన తరచూ విరుచుకుపడుతుంటారు. తెలంగాణ రాష్ట్రానికి ఇసమెత్తు అన్యాయం వచ్చినా ఆయన సహించలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం విపరీతంగా తపించే తత్వం వినోద్ కుమార్ లో కనిపిస్తుంది.
అలాంటి పెద్దమనిషి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అది కూడా అమరావతిలో. టీఆర్ ఎస్ అగ్గిబరాఠా ఏంది.. చంద్రబాబును కలవటం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. వినోద్ కుమార్ తమ్ముడు శ్రీనివాసరావు కుమార్తె వివాహం జరగనుంది. దీనికి ఆహ్వానించేందుకు అమరావతికి వచ్చి బాబును కలిసి శుభలేఖ ఇచ్చారు. పెళ్లికి రావాలని కోరారు. బాబు అందుకు అంగీకరించినట్లుగా చెబుతున్నారు.