ఎన్నికలు అనే సరికి నేతల మధ్య పోటీ కామన్ గా మారిపోయింది. నిజానికి ఎన్నికలు అంటే. రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. అయితే, దీనికి భిన్నంగా ఇప్పుడు పార్టీలో టికెట్లు సంపాదించుకోవడమే పెద్ద బిగ్ ఫైట్ గా మారిపోయింది. అది ఏ పార్టీ అయినా కూడా నాయకుల మధ్య పోరు షరా మామూలే! అన్నట్టుగా ఉంది పరిస్థితి. తెలంగాణలో ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అయితే, ఆయన ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేసి.. నల్లగొండ నుంచి విజయం సాధించారు. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఇక్కడ పోటీ చేసేందుకు నాయకులు రెడీ అయ్యారు. అయితే, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి పేరు మాత్రమే వినిపిస్తుండగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నుంచి మాత్రం నాయకులు పోటా పోటీగా ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవడం - టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో వాడి వేడిగా పరిస్థితి మారిపోయింది.
పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి రెండో సారి కూడా విజయం సాధించాలని అనుకున్న కేసీఆర్ కుమార్తె.. కవిత ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆమె ఇప్పుడు ఉప ఎన్నికలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని నిర్ణయించుకున్నారు. వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత జగిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని... ఆమె రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె తిరిగి లోక్ సభకే పోటీ చేసి ఓడిపోయారు.
ఇక ఇప్పుడు ఆమె పేరు హుజూర్‌నగర్ నుంచి ఉప ఎన్నికల్లో వినిపిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. తాను ఎంతో ఖర్చు పెట్టుకున్నానని - ఇప్పుడు కూడా తనకే ఇవ్వాలని ఆయన సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలోకేసీఆర్ తన కుమార్తె కవితను ఇక్కడ నుంచి పోటీ కి నిలబెట్టే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదే టైంలో కాంగ్రెస్ నుంచి సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డితో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరు సైతం తెరమీదకు వస్తోంది. మరి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎలా ఉంటుందో ? చూడాలి.