గడిచిన మూడు.. నాలుగు రోజుల నుంచి డ్రగ్స్ పరీక్షలకు సంబంధించి ట్వీట్ల యుద్ధం మరో మలుపు తిరిగింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ రేవంత్ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ ఆరోపించటం.. కోర్టును ఆశ్రయించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రేవంత్ నివాసాన్ని ముట్టడించటం ద్వారా తన నిరసనను తెలియజేయాలన్న గులాబీ దళం చేసిన ప్రయత్నం షాకిచ్చింది. సాధారణంగా ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని విఫలం చేస్తారు. మామూలుగా అయితే.. అధికారపక్షం నేతల ఇళ్లను విపక్షాలు ముట్టడి చేసే ప్రయత్నం చేస్తాయి. అందుకు భిన్నంగా.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ ఇంటిని అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు.
ఇలాంటి పరిణామాన్ని ముందే ఊహించారేమో కానీ.. కాంగ్రెస్ కార్యకర్తలు ముందుస్తుగా ప్రయత్నాలు చేసుకున్నట్లు కనిపించింది. రేవంత్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల్ని అడ్డుకోవటమే కాదు.. ఎదురుదాడికి దిగారు. దీంతో.. ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కర్రలు.. రాళ్లతో దాడులు చేసుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. టీఆర్ఎస్ యువత విభాగానికి చెందిన నేతలు (కటారి స్వామియాదవ్.. జహీర్ ఖాన్.. ఖలీం తదితరులు) రేవంత్ దిష్టిబొమ్మను తీసుకొచ్చి ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.
అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకోవటంతో ఘర్షణ నెలకొంది. రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన వారిని కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో వెంటపడ్డారు. దీంతో.. టీఆర్ఎస్ వీ సభ్యులు రాళ్లతో ఎదురుదాడి చేశారు. ఇరు వర్గాల్ని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా.. పట్టించుకోకపోవటంతో ఇరువర్గాల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తగా పికెట్ ను ఏర్పాటు చేశారు. రేవంత్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్ యూత్ విభాగ నేతలు గాయాలు కావటంతో చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. అమరవీరులస్తూపం వద్దకు రేవంత్ రావటం ద్వారా.. అపవిత్రమైందంటూ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేశారు. మరోసారి అమరవీరుల స్తూపం వద్దకు రేవంత్ వస్తే కాళ్లు విరగ్గొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా.. అధికార పక్షంగా విపక్ష నేత ఇంటి ముట్టడికి వెళ్లటం.. అక్కడ ఊహించని వ్యతిరేకత ఎదుర్కోవటం లాంటివి వ్యూహ వైఫల్యమే అవుతుందన్న అభిప్రాయమవుతోంది. మరి.. ఇలాంటి తప్పుల్ని గులాబీ దళం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచన వినిపిస్తోంది.