హైదరాబాద్ సిటీలోని బస్టాప్ లు.. రద్దీ ఏరియాల్లో వాణిజ్య ప్రకటనలతో ఉన్న భారీ హోర్డింగ్స్ చూస్తుంటారు. ఇంతకాలం కనిపించిన వాణిజ్య సంస్థలకు చెందిన యాడ్స్ స్థానే ఇప్పుడు గులాబీ రంగు బ్యాక్ గ్రౌండ్ తో తళతళలాడిపోతున్న సరికొత్త ప్రకటనల్ని గమనించారు. ప్రభుత్వ పథకాల్ని ఆకర్షణీయంగా చెబుతూ.. కలర్ ఫుల్ గా ఉన్న సరికొత్త కటౌట్లు.. హోర్డింగ్స్ సిటీలో సందడి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ లేని విధంగా.. వినూత్న రీతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు.. కటౌట్లు ఏర్పాటు చేయటం గమనార్హం.
కనురెప్ప పాటు కూడా కరెంటు కోత లేని నగరంగా.. నిత్యం తాగునీరు అందించే సిటీగా.. ఇలా చాలానే హామీల్ని.. సరికొత్త స్వప్నాల్ని ఆవిష్కరించే దిశగా ప్రకటనల వెల్లువ ఎక్కువైంది. ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ సర్కారు వ్యూహాత్మకంగా తన ప్రచారాన్ని మొదలు పెట్టింది. గ్రేటర్ మీద గులాబీ జెండా ఎగరటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలంగాణ సర్కారు.. అందుకు తగ్గట్లుగా.. తాము త్వరలో చేసే ప్రచారానికి నాందిగా తాజా ప్రచారమన్న భావన వ్యక్తమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల వివరాల్ని వెల్లడిస్తూ.. సిటీ బస్టాప్ ల వద్ద.. జనసమ్మర్థం ఉన్న కూడళ్ల దగ్గర కొత్త కొత్త కటౌట్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే.. పథకాలకు.. విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ప్రకటనల్ని రూపొందించటం విశేషం. చడీ చప్పుడు లేకుండా.. వివిధ వాణిజ్య ప్రకటనల స్థానే కనిపిస్తున్న ఈ హోర్డింగ్స్ నగర జీవుల్ని బాగానే ఆకర్షిస్తున్నాయి. చూస్తుంటే.. తెలంగాణ అధికారపక్షం గ్రేటర్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తుందే.