పోల్ మేనేజ్ మెంట్ గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా సమకాలీన రాజకీయాల్లో మరే అధినేతకు తెలీదనే చెప్పాలి. ఎన్నికలు జరగటానికి ఏడాది ముందే ప్లాన్ సిద్ధం చేసుకోవటంతో పాటు.. అందుకు తగ్గ ప్రయత్నాల్ని దీర్ఘకాలికంగా.. స్వల్పకాలికంగా చేసే విలక్షణ తీరు ఆయనలో కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా అనుసరించే వ్యూహాల విషయంలో ఆయన చాలా దూరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
ప్రత్యర్థుల కంటే ఎంతో ముందుండే ఆయన.. వాళ్లు అలెర్ట్ అయ్యే సమయానికే ఎంతోకొంత అధిక్యతతో ఉండే వైనం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఇప్పటికే ప్రచారం షురూ చేసినట్లుగా చెప్పొచ్చు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం భారీగా షురూ చేయటం స్పష్టంగా కనిపిస్తుంది.
గ్రేటర్ పరిధిలోని ప్రజల మదిని దోచుకునేలా.. నిరంతర విద్యుత్తు.. అందరికి మంచినీటి సౌకర్యం లాంటి హామీల్ని.. ఇప్పటికే జరిగిపోయినట్లుగా చూపిస్తున్న వైనం కాస్తంత ఆశ్చర్యకరంగా కనిపించక మానదు. అంతేకాదు.. నగరజీవుల కంట్లో పడేందుకు వీలుగా భారీగా ప్రచారం ప్రారంభించిన గులాబీ బాస్.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో అధికారపక్షానికి చెందిన ఫెక్ల్సీలు డామినేట్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ముందస్తుగా స్టార్ట్ చేయటం.. ప్రత్యర్థి పార్టీలు అలెర్ట్ కాక ముందే ప్రచారంలో ముందుండటం గమనార్హం.
మారిన నిబంధనల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి ఫోటోను మాత్రమే వాడాల్సి ఉన్నందున.. ప్రచారం మొత్తం పార్టీ తరఫున చేపడుతున్నారు. ఇక.. నగరంలో దాదాపు 2400 హోర్డింగులు ఉంటే ప్రస్తుతం 800 హోర్డింగులు గులాబీ పార్టీ సేవలో తరిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో హోర్డింగుల సంఖ్య 1500 నుంచి 1700 చేయటమే లక్ష్యంగా టీఆర్ ఎస్ వెళుతోంది. అంటే.. ప్రతి పది హోర్డింగుల్లో ఆరుకు పైగా హోర్డింగులు గులాబీ బాస్ తో ఉంటాయన్న మాట. దీనికి తగ్గట్లే.. హోర్డింగ్ ఏజెన్సీల వద్ద టీఆర్ ఎస్ భారీగా బుక్ చేసుకున్నట్లు చెబుతున్నారు. అధికారపక్షం తలుచుకుంటే.. సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు కదా.
ఇంత భారీ ఎత్తున హోర్డింగ్స్ ప్రచారం షురూ చేయటంతో.. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగులు గులాబీ రంగుతో కళకళలాడిపోతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న.. చేపట్టాలని భావిస్తున్న పథకాలకు సంబంధించిన వివరాలతో.. ఆకర్షణీయంగా రూపొందించారు. మొత్తంగా సిటీ గులాబీ హోర్డింగ్స్ తో కళకళలాడిపోతోందని చెప్పక తప్పదు.