గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటం.. నామినేషన్ల పర్వం ఈ రోజు షురూ కావటం తెలిసిందే. అధికార.. విపక్షాలకు చెందిన అభ్యర్థులు ఎవరూ మొదటిరోజు నామినేషన్లు జారీ చేయలేదు. గురువారం నాటికి చాలావరకు టికెట్లు కన్ఫర్మ్ అవుతాయన్న మాట వినిపిస్తోంది. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా.. గులాబీ పార్టీలో అత్యధికం సిట్టింగులకే అవకాశం ఇస్తారని చెబుతున్నారు. వీలైనంతవరకు వ్యతిరేకత లేకుండా చూసుకోవటం.. రెబెల్ అభ్యర్థుల బెడదను తగ్గించుకోవాలన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగే వారికి అధినాయకత్వం బంఫర్ ఆఫర్ ప్రకటించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించి అభ్యర్థుల మీద భారం పడకుండా ఉండేందుకు వీలుగా ప్యాకేజీని సెట్ చేసినట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్ తో పాటు.. రూ.2 కోట్ల మొత్తాన్ని ఖర్చుల కోసం ఇస్తున్నట్లుగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ నడుస్తోంది.
తెలంగాణ అధికారపక్షం టికెట్ తో పాటు రూ2 కోట్లు ఇస్తుందో లేదో కానీ.. ఈ పేరుతో కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థులు సైతం ఖర్చుల కోసం పార్టీ వైపు చూడటంతో వారేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదంటున్నారు. ఇప్పటికిప్పుడు చేతికి నిధులు రానప్పటికీ.. అంతర్గతంగా మాత్రం ప్యాకేజీకి సంబంధించిన హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.