తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు మాట తప్పారు. ఎంత కష్టమైనా అనుకున్న పనిని అక్షరాల చేసి తీరే కేసీఆర్ ఇపుడు ఆ ఖ్యాతిని పోగొట్టుకున్నవ్యక్తిగా నిలిచారు. కేసీఆర్ మాట తప్పారని చెప్తుంది వేరెవరో కాదు... స్వయానా కేసీఆర్ సొంత పార్టీ తెలంగాణ రాష్ర్ట సమితికి చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తుండటం మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు.
తెలంగాణ రాష్ర్టంలో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. సాధారణంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు పార్టీ నాయకులు వెంటనే నామినేటెడ్ పదవుల గురించి ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో టీఆర్ ఎస్ కు నాయకుల తాకిడి ఎక్కువగానే ఉంది. స్పందన భారీ స్థాయిలో అయినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఒకింత ఆలస్యంగా స్పందించారు. సుదీర్ఘ డైలమా తర్వాత దసరా వరకు గులాబీ పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టుల భర్తీ తీపికబురు అందిస్తానని ప్రకటించారు. ఈమేరకు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని కూడా వేసి...ఎవరు అర్హులు, ఏ తరహా పోస్టులకు ఎవరిని ప్రతిపాదించాలి అనే వివరాలు ఆ కమిటీకి అందజేయాల్సిందిగా కోరారు. దీంతో చోటా మోటా నాయకులు సహా ఎమ్మెల్యేలంతా ఆ ముగ్గురు మంత్రుల వద్దకు పోలోమంటూ బయల్దేరారు.
దసరా వస్తున్న నేపథ్యంలో టీఆర్ ఎస్ నాయకుల్లో ఉత్సాహం రెట్టించింది. త్వరలోనే పదవుల పందేరం పూర్తవుతుందని అంతా భావించారు. దసరా నాడే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేసుకున్నారు. అయితే దసరా కాదు కదా ఆ పండుగ పూర్తయి దాదాపు వారం గడిచిన కేసీఆర్ నామినేటెడ్ పదవుల ఊసెత్తలేదు. అసలెందుకు ఇలా జరిగిందని గులాబీ నాయకుడొకరు ఆరాతీస్తే... వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ఉండటం వల్ల ఇపుడు పదవుల పంపకం చేపడితే ఎన్నికల కోడ్ వస్తుందని అందుకే నామినేటెడ్ ప్రక్రియను ప్రక్రియను పక్కనపెట్టినట్లు తేలింది. వరంగల్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఈ పందేరం ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్... ప్రమాణస్వీకారం చేయడమే అన్నట్లుగా ప్రకటించి అనంతరం నిరీక్షణలో ఉంచుతున్నారని గులాబీ శ్రేణులు సణుక్కుంటున్నాయి.