ఇది జైపూరా...? హైదరాబాదా?

Update: 2016-01-08 06:41 GMT
గ్రూప్ 1 పరీక్షలో అడిగినా... మీలో ఎవరు కోటీశ్వరుడులో అడిగినా కూడా దీనికి జవాబు ఒక్కటే. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ను పింక్ సిటీ అంటారని చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెబుతాడు. కానీ, కొద్ది రోజుల పాటు  ఆ ప్రశ్నకు జవాబును మార్చుకోవాలేమో అనిపిస్తోంది. జైపూర్ బదులు హైదరాబాద్ అని ఆన్సర్ చెప్పినా రైటే కావొచ్చని అనిపిస్తోంది.  పాలక టీఆరెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అంతలా గులాబీ రంగులోకి మార్చేయడమే దీనికి కారణం. అవును... గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దెబ్బకు టీఆరెస్ పార్టీ నగరం మొత్తాన్ని గులాబీ రంగులోకి మార్చేసింది.
            
టీఆరెస్ పార్టీ హైదరాబాద్ ను ఇలా గులాబీ రంగులోకి మార్చేయడంపై నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. జంట నగరాలు మొత్తం టీఆరెస్ జెండాలు - కేసీఆర్ హోర్డింగులతో నిండిపోవడంపై  జాతీయ మీడియాలో వరుసగా కథనాలువస్తున్నాయి.  ఇంతకుముందు సిటీలో ప్రధానమైన కూడళ్లలో కమర్షియల్ యాడ్స్ కనిపించేవి... ఇప్పుడు మాత్రం కేసీఆర్, ఆయన పథకాల ప్రచారమే కనిపిస్తోంది. కూడళ్లలో హోర్డింగులే కాదు ఫ్లై ఓవర్లు - మెట్ర్ పిల్లర్లు కూడా కేసీఆర్ బొమ్మలతోనే నిండిపోయాయి. వాటిలో టీఆరెస్ ప్రభుత్వ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ - టీడీపీలు అందులో ఒక శాతం కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నాయి..... వంద గులాబీ జెండాలు కనిపిస్తుంటే టీడీపీ - కాంగ్రెస్ జెండాలు కానీ, ప్రచార హోర్డింగులు కానీ ఒక్కటి కూడా కనిపించకపోవడం విచిత్రం. అయితే... అక్కడక్కడా బీజేపీ హోర్డింగులు మాత్రం ఉంటున్నాయి. దీంతో హైదరాబాద్ లో విపక్షాలు సైడయిపోయాయన్న కోణంలోనూ పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి.
Tags:    

Similar News