తెలంగాణలో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించారనే ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు రేగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకురావాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తూ వేల కోట్ల రూపాయలతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ పడేస్తోందని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇలా వేల కోట్ల రూపాయలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ప్రభుత్వాలను పడేశారని విమర్శిస్తోంది. అలాగే రాజస్థాన్, జార్ఖండ్‌ల్లోనూ ఇలాంటి ప్రయత్నాలే చేస్తోందని టీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియోలను ప్రచార అస్త్రాలుగా వినియోగించి బీజేపీని దెబ్బతీయడానికి టీఆర్‌ఎస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో 60 మంది నేతలను హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌ల్లో బీజేపీ వ్యతిరేక ప్రచారానికి పంపుతోందని అంటున్నారు. ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ఆడియో, వీడియోల ద్వారా బీజేపీ పన్నాగాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వ్యూహాలు రచిస్తోంది.
ఇందుకోసం స్వయంగా సీఎం కేసీఆరే 60-70 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందంతో ఆ రెండు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించినట్టు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ బృందం గుజరాత్‌లో పర్యటించి భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటుచేసి వీడియోలను ప్రదర్శించనున్నట్టు వెల్లడించాయి.
అదేవిధంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బీజేపీ దుష్ట రాజకీయాలను వివరించేందుకు ఆ వీడియోలను అన్ని ప్రాంతీయ భాషల్లోకి కూడా తర్జుమా చేయాలని నిర్ణయించారు. ఆ పని ఇప్పటికే మొదలైందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.