తెలంగాణలో ప్రతిపక్షం గాయబ్‌

Update: 2019-01-22 06:18 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో అనితర సాధ్యమైన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసింది. గ్రామాలే రాజకీయాలకు పట్టుకొమ్మగా ఉన్న సందర్భంలో పంచాయితి ఎన్నికలలోను తెలంగాణ రాష్ట్ర సమితి విజయవిహారం చేసింది. పంచాయితి ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగినా దాదాపు 80 శాతం పంచాయితీలలో తెలంగాణ రాష్ట్ర సమితి బలపరచిన అభ్యర్దులే విజయం సాధించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు బలపరచిన అభ్యర్దులు గణనీయ సంఖ్యలో ఓటమి పాలైయ్యారు. దీంతో తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపక్షాలకు చుక్కలు చూపించినట్లు అయ్యింది. మూడు విడతలుగా జరుగుతున్న పంచాయితి ఎన్నికలలో తొలివిడతలో 2000 పైచిలుకు పంచాయితీలను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. ఎటువంటి ప్రచార ఆర్భాటం - ముఖ్యనాయకుల పర్యటనలు వంటివి లేకుండానే తొలివిడతలో అత్యధిక సంఖ్యలో పంచాయితీలు టిఆర్‌ ఎస్ వశం అయ్యాయి.

ముందస్తు ఎన్నికల అనంతరం తక్కువ వ్యవ్యధిలోనే పంచాయితీ ఎన్నికలు కూడా జరిగాయి. రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్దులను ప్రకటించకపోయినా గ్రామాలలో ఏ అభ్యర్ది ఏ పార్టీకి చెందిన వారో తెలిసిపోయింది. దానిని అనుసరించే ఎన్నికల ఫలితాలు కూడా ఏ పార్టీ ఎన్ని గెలుచుకుందో వెల్లడించింది. గ్రామాలలో రాజకీయాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ నుంచే ముఖ్య నాయకులు ఎదుగుతారు. ముఖ్యమంత్రులుగానో - మంత్రులుగానో పనిచేసిన వారెందరో అంతకు ముందు గ్రామ సర్పంచ్‌ లు గాను - వార్డ్ మెంబర్లుగాను ఎన్నికైనవారే. తెలంగాణలో జరిగిన పంచాయితీ ఎన్నికలలో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామాలలోను తమ పట్టు నిలుపుకుంది. ఈ ఎన్నికల విజయంతో గ్రామాలలో ప్రతిపక్ష పార్టీలకు చోటు లేకుండా పోయింది. ఇప్పటికే అనేక మున్సీపాలీటీలు - కార్పొరేషన్లు తమ ఖాతా లో వేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పట్టణ  ఓటర్లు తమతోనే ఉన్నారని రుజువు చేసుకుంది. పంచాయితీ ఎన్నికలతో గ్రామీణ ఓటర్లు కూడా తమ వైపే ఉన్నారని రుజువు చేసుకుంది.


Full View

Tags:    

Similar News