చివరివరకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేల్చకుండా చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటించాలన్న టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. ఆడియో లీక్ వ్యవహారంతో కౌశిక్ రెడ్డి బండారం బయటపడి కాంగ్రెస్ కు రాజీనామా చేయాల్సి వచ్చింది. కౌశిక్ రెడ్డి కెరీర్ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. ఈ పరిణామంతో టీఆర్ఎస్ లోనూ టికెట్ దక్కడం కష్టంగా మారింది.
ఇక కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా కూడా లోపాయికారిగా టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించాడన్న టాక్ కాంగ్రెస్ లో ఉంది. ఈటల టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాక కాంగ్రెస్ లో చేర్పించాలని రేవంత్ సహా నేతలు ప్రయత్నిస్తుంటే కౌశిక్ మాత్రం ఈటలపై తీవ్ర ఆరోపణలు చేయడం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టైంది. ఆ తర్వాత ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ను కలిసి రహస్యంగా చర్చలు జరపడం దుమారం రేపింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డి 62వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీచేస్తుండడంతో టీఆర్ఎస్ ఓట్లు చీలిపోయాయి. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను తాను సాధించగలిగితే విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
కాంగ్రెస్ ను చివరి నిమిషంలో దెబ్బకొట్టి కౌశిక్ రెడ్డిని చేర్చుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ సిద్ధం చేసింది. అంతా అనుకున్నట్లు జరుగుతుందన్న సమయంలో ఆడియో లీక్ కౌశిక్ రెడ్డి కొంపముంచింది. టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టినట్టైంది. ఇక టీఆర్ఎస్ సైతం కౌశిక్ రెడ్డికి టికెట్ పై హామీ ఇవ్వలేకపోతోంది. దాంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి ఎంతో ఆలోచించాడు. యువకుడైన కౌశిక్ పోయిన సారి ఈటలకు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచాడు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి పోవడంతో రేవంత్ కు తొలి షాక్ తగిలింది.
ఈ క్రమంలోనే కౌశిల్ లాంటి బలమైన అభ్యర్థి పోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో రేవంత్ రెడ్డికి ఎవరికి టికెట్ ఇస్తాడన్నది ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ తర్వాత దీనిపై ఆయన దృష్టి పెడుతారా? అనే చర్చ జరుగుతోంది.
ఇక కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అలెర్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉండే నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ కఠినంగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ఆ రకమైన సంకేతాలను కాంగ్రెస్ నేతలకు ఇవ్వనుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు టీఆర్ఎస్ నుంచే పోటీచేయబోతున్నట్టు ప్రకటించారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెబుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది. సోషల్ మీడియా, మీడియాలో వైరల్ అయ్యింది.
కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాదన్నపేటకు చెందిన విజయేందర్ అనే టీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని.. గ్రామ యువతను పోగు చేసి ప్రచారం చేస్తే తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఆడియో లీక్ దుమారం రేపడం.. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఇక కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు కౌశిక్ ప్రకటించాడు.
ఇక మాజీ పీసీసీ బాస్ ఉత్తమ్ కు సమీప బంధువు కౌశిక్ రెడ్డి. అలాంటిది ఉత్తమ్ కు తెలియకుండా ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లడంటున్నారు.పోయిన సారి హుజూరాబాద్ టికెట్ ను ఉత్తమ్ దగ్గరుండి ఇప్పించి ప్రచారం కూడా చేశాడు. అలాంటి ఇప్పుడు ఉత్తమ్ హస్తం లేకుండా కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళుతున్నాడా? అని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉత్తమ్ ఏమైనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నాడా? అన్న అనుమానాలున్నాయి.
అయితే ఈ ప్రచారాన్ని ఉత్తమ్ వర్గం ఖండిస్తోంది. కౌశిక్ తో తమకు సంబంధం లేదని ఉత్తమ్ సన్నిహితులు అంటున్నారు. హుజూరాబాద్ లో ఇప్పుడు కాంగ్రెస్ కు క్యాండిడేట్ లేకుండా పోయారు. మరి ఈ గందరగోళ పరిస్థితిని రేవంత్ రెడ్డి ఎలా చక్కదిద్దుతాడన్నది వేచిచూడాలి.