తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ లో సాధించిన అద్భుత విజయం తర్వాత చోటుచేసుకున్న మరో ఆసక్తికర సందేహం...ఇంతకీ మేయర్ ఎవరు? సీనియర్ నేత - ఎంపీ కే కేశవరావు కూతురు విజయలక్ష్మీ అవుతారా? లేక పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న బొంతు రామ్మోహన్ కు ఆ అవకాశం దక్కుతుందా? అనే డిబేట్లు పెద్ద ఎత్తున్నే సాగాయి. గురువారం మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ దీనికి పరోక్షంగా ఫుల్ స్టాప్ పెట్టారు. మేయర్ అభ్యర్థి విషయలో క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే ఐటీ - పంచాయతీరాజ్ శాఖ బాధ్యతల్లో ఉన్న మంత్రి కేటీఆర్ పట్టాణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ట్యాంక్ బండ్ సమీపంలోని బుద్ధపూర్ణిమలో అధికారులతో పురపాలక శాఖపై రివ్యూ ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం లంచ్ సమయంలో కేటీఆర్ పక్కన కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ కనిపించారు. రేపు మేయర్ అభ్యర్థి ఎన్నిక క్రమంలో కేటీఆర్ పక్కన బొంతు ఉండటంతో ఆయనే మేయర్ కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే లంచ్ ముగిసిన వెంటనే జీహెచ్ ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ ను అధికారులకు పరిచయం చేశారు. ఇలా బొంతు రామ్మోహన్ ను ప్రత్యేకంగా పరిచయం చేయటం నగర ప్రథమ పౌరుడు ఆయనేనని చెప్పినట్లయింది.
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ఘటన సైతం చోటుచేసుకుంది. బోరబండ కార్పొరేటర్ ఫసీయూద్దీన్ కూడా మంత్రి కేటీఆర్ వెంట ఉన్నారు. ఆయన్ను కూడా కేటీఆర్ పరిచయడం చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన ఫసీయూద్దీన్ డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలోఈ ఇద్దరిని పరిచయం చేయటం ద్వారా వీళ్లద్దరూ ఖరారైనట్లేనని గులాబీ వర్గాలు డిసైడయిపోయాయి.