జీహెచ్ఎంసీ : టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ వీరే

Update: 2020-11-20 17:30 GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ఇప్పుడు ప్రచారానికి పార్టీలన్నీ పదును పెడుతున్నాయి. గ్రేటర్ పీఠాన్ని కొల్లగొట్టాలని యోచిస్తున్న టీఆర్ఎస్ పార్టీ పకడ్బందీగా ముందుకెళుతోంది. 100 సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది.

ఇప్పటికే 150 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో జట్టుకట్టి అవగాహనతో ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే ప్రచారపర్వంలో దూసుకుపోయేలా టీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తోంది.

రేపటి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రేపు కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ లో.. ఎల్లుండి మహేశ్వరం, ఎల్బీనగర్ లో ప్రచారం చేయనున్నారు.

ఇక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.

ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రులకు డివిజన్లు కేటాయించారు. స్టార్ క్యాంపెయినర్స్ ను తాజాగా ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్స్ గా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ లు వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News