తిధులు.. నక్షత్రాలు.. జాతకాలు.. ఇలా నమ్మకాల విషయంలో పెద్దపీట వేస్తూ.. సెంటిమెంట్ ను తరచూ ఫాలో అయ్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురయ్యేలా చేస్తోంది. అదే సమయంలో సెంటిమెంట్ కే గులాబీ బాస్ సవాలు విసిరారా? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మేనల్లుడు హరీశ్ రావును వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని అందరూ అంచనా వేసిందే అయినా.. సెంటిమెంట్ కారణంగా అయినా హరీశ్ కు కాకుండా మరెవరికైనా అప్పజెబుతారని భావించారు.
కానీ.. తన తాజా నిర్ణయంతో సెంటిమెంట్ కు కేసీఆర్ సవాలు విసిరినట్లుగా చెప్పక తప్పదు. ఇప్పటికే తన విధేయతను తరచూ ప్రదర్శించుకోవటంతో పాటు.. నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండే హరీశ్.. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ సెంటిమెంట్ ఏం చేస్తుందన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. కేసీఆర్ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి ఆయన మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖను ఎవరు చేపట్టినా.. వారు మధ్యలోనే వెళ్లిపోవటం.. వారిబ మంత్రి పదవి ఊడిపోవటం.. అప్పటివరకు ఒక వెలుగు వెలిగిన వారు కాస్తా.. డల్ అయిపోవటం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రివర్గంలో తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా మాత్రమే కాదు.. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా వ్యవహరించారు. ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే ఆయన మంత్రి వర్గం నుంచి తొలగించబడ్డారు. కట్ చేస్తే.. రాజయ్య స్థానంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా డాక్టర్ లక్ష్మారెడ్డిని నియమించారు. రెండోసారి టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను మంత్రివర్గంలోనే తీసుకోలేదు. ఇవాల్టి రోజున లక్ష్మారెడ్డి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్నదే ప్రశ్నగా మారింది. అంతలా ఆయన అప్రాధాన్యత స్థానంలో సాగుతున్నారు. రెండోసారి కొలువు తీరిన వేళ.. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పదవిని పార్టీలో అత్యంత సీనియర్.. కేసీఆర్ కు విధేయుడైన ఈటల రాజేందర్ కు అప్పజెప్పారు.
అలాంటి ఈటలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి బర్తరఫ్ చేయటం తెలిసిందే. ఆయనపై తీవ్రమైన భూకబ్జా ఆరోపణలపై మంత్రి వర్గం నుంచి తొలగించటం.. అనంతరం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. తాజాగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన ఘన విజయాన్ని సాధించారు. ఇలా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను చేపట్టిన వారందరికి ఏదోలాంటి తిప్పలు తప్పవన్న సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. ఇలాంటివేళ.. హరీశ్ కు ఈ శాఖను కట్టబెట్టటం ద్వారా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? సెంటిమెంట్ కే హరీశ్ సవాలుగా నిలిచి.. గతంలో ఎదురైన సీన్లు రిపీట్ కాకుండా ఉంటాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కాలం ఎలాంటి సమాధానాన్ని ఇస్తుందో చూడాలి.