హుజూర్‌ న‌గ‌ర్‌ పై ఆరా స‌ర్వే...ఆ పార్టీకి షాక్‌

Update: 2019-10-21 14:01 GMT
తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ప్రముఖ సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన సర్వే రిపోర్టును వెల్లడించింది. ఈ సంస్థ స‌ర్వే ప్ర‌కారం అక్క‌డ టీఆర్ ఎస్ 50 శాతానికి పైగా ఓట్ల‌తో విజ‌యం సాధించ‌బోతోంద‌ని తేలిపోయింది. ఇక ఈ సంస్థ అటు తెలంగాణ‌తో పాటు ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ నిజం అయ్యాయి. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ 75-88 సీట్లు సాధిస్తుంద‌ని చెప్ప‌గా ఆ పార్టీకి అక్క‌డ 88 సీట్లు వ‌చ్చాయి.

ఇక ఏపీలో వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని.. ఆ పార్టీకి 120 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని చెప్ప‌గా ఏకంగా 151 సీట్లు వ‌చ్చాయి. దీంతో ఈ సంస్థ చేస్తోన్న స‌ర్వేల‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ రాజ్‌ గోపాల్ స‌ర్వేల్లో మాత్రం తెలంగాణ‌లో మ‌హాకూట‌మి... ఏపీలో టీడీపీ గెలుస్తుంద‌ని చెప్పినా రాజ్‌ గోపాల్ స‌ర్వే బొక్క బోర్లాప‌డ‌గా... ఆరా మ‌స్తాన్ స‌ర్వే నూటికి నూరు శాతం నిజ‌మైంది.

ఇక ఇప్పుడు హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్ ఖ‌చ్చితంగా 50 శాతం సీట్ల‌తో గెలుస్తుంద‌ని ఆరా స‌ర్వే వెల్ల‌డించింది. స్వ‌యంగా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన స్థానం కావ‌డంతో పాటు అక్క‌డ కాంగ్రెస్ నుంచి ఆయ‌న భార్యే పోటీలో ఉండ‌డంతో ఈ ఎన్నిక ఆస‌క్తిగా మారింది. ఇక టీఆర్ ఎస్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు.

ఈ స‌ర్వే ప్ర‌కారం టీఆర్ ఎస్‌ కు ఏకంగా 50.48 శాతం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్‌ కు 39.95 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఇతర పార్టీల అభ్యర్థులకు 9.57 శాతం ఓట్లు వస్తాయట‌. అంటే టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్‌ కు మ‌ధ్య ఏకంగా 10 శాతం ఓట్ల వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. అంటే టీఆర్ ఎస్ అభ్య‌ర్థి 15-20 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించ‌నున్నారు.
Tags:    

Similar News