హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ విజయం.. మెజార్టీ ఇదే

Update: 2019-10-24 10:40 GMT
అస్సలు గెలుస్తుందో లేదోనని భయపడ్డ హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ భారీ గెలుపు సాధించింది. ఏకంగా 43,284 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని రికార్డ్ మెజార్టీతో ఓడించడం విశేషం. ఈ ఫలితం చూస్తే హుజూర్ నగర్ ఓటర్లు ఏకపక్షంగా టీఆర్ఎస్ ను గెలిపించారని అర్థమవుతోంది.

ఈ హుజూర్ నగర్ లో ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009లో సాధించిన 29194 ఓట్ల మెజారిటీనే అత్యధికంగా ఉంది. దీనిని తాజాగా సైదిరెడ్డి తిరగరాశాడు. 15వ రౌండ్ లోనే 29వేల మెజార్టీని సాధించడం విశేషం.

ఇక హుజూర్ నగర్ లో బీజేపీ, టీడీపీ డిపాజిట్లు కోల్పోవడం సంచలనంగా మారింది.

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సైదిరెడ్డి పరాజయంతో ఏమాత్రం కృంగిపోకుండా ఉప ఎన్నికల్లో ప్రచారంతోపాటు ప్రజల మద్దతును కూడగట్టడంలో విజయం సాధించారు.
Tags:    

Similar News