ఏపీ పాలిటిక్స్ పై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తనకు ఉన్న సమాచారం మేరకు ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని స్పష్టం చేశారు.బాబు చేతకాని తనం వల్లే ఏపీలో టీడీపీకి ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. జన్మభూమి కమిటీల ఆ పార్టీ నాయకులు ప్రజలను వేధింపులకు గురిచేశారని.. అదే ఎఫెక్ట్ అయ్యిందని వివరించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు.. విజయవాడలో కూడా చక్రం తిప్పలేడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఏపీకి అన్యాయం జరిగిందని ఓ వైపు మొత్తుకుంటున్న బాబు.. మరో వైపు తానే నంబర్ 1 అంటూ చంకలు గుద్దుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. అయితే ఏపీలో దాడులపై చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో చెప్పాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు కేటీఆర్ చెప్పారు. దేశంలో మోడీ, రాహుల్ మధ్య ఈ ఎన్నికల్లో పోటీ నెలకొంటుందనే విషయంలో అనుమానాలున్నాయని.. ఎందుకంటే దేశంలో చాలా పార్టీలు వాటికి ప్రత్యామ్మాయంగా జనాలకు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.