వాహనాలకు ఫైన్లు వేయటం మామూలే. అయితే.. ఒకేసారి భారీ ఫైన్ అంటే.. రూ.10వేలో.. రూ.20వేలో వేస్తారు. అందుకు భిన్నంగా ఏకంగా రూ.44.64 లక్షల ఫైన్ వేసే అవకాశం ఉంటుందా? అంటే లేదని చెబుతారు. కానీ.. తాజాగా ఒడిశాలో అలాంటి పని చేసిన అధికారులు సదరు లారీ యజమానికి దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఒకే విడతలో ఇంత భారీ ఫైన్ వేయించుకున్న లారీగా రికార్డును క్రియేట్ చేశారని చెబుతున్నారు.
ఇంతకీ ఈ లారీ ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతోంది? అందులో ఏముంది? అన్న వివరాల్లోకి వెళిత.. ఒడిశాలోని కేంఝుర్ జిల్లా చంపువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జీఎస్టీ ఎన్ ఫోర్సు మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు షురూ చేశారు. ఈ క్రమంలో ఒక లారీని ఆపి.. తనిఖీ చేశారు. లారీ మొత్తం అక్రమంగా తరలిస్తున్న గుట్కాగా గుర్తించారు.
డ్రైవర్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ కు వస్తున్న ఈ లారీ అక్రమంగా వస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు రూ.44,64,272 జరిమానాగా విధించారు. ఒడిశా రాష్ట్రంలో ఒక వాహనానికి అత్యధిక ఫైన్ వేసిన ఉదంతంగా దీన్ని చెబుతున్నారు. మరి.. లారీ యజమాని పరిస్థితేమిటో?