దారుణం: అవుల్ని త‌ర‌లిస్తున్నార‌ని చంపేశారు

Update: 2015-10-16 12:00 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని దాద్రిలో 55ఏళ్ల వృద్ధుడు గోమాంసం తిన్నార‌న్న ఆరోప‌ణ‌తో అక్క‌డి స్థానికులు కొట్టి చంపేసిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. రోజులు గుడుస్తున్నా దాద్రి ఉదంతానికి సంబంధించి క‌ల‌క‌లం ఇంకా కొన‌సాగుతోంది. ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ జ‌ర‌గ‌ట‌మే కాదు.. ప‌లువురు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

సాదాసీదా జ‌న‌మే కాదు.. క‌వులు.. క‌ళాకారులు.. మేధావులు సైతం త‌మ మండిపాటును త‌మ‌కొచ్చిన పుర‌స్క‌రాల్ని తిరిగి ఇవ్వ‌టం ద్వారా తెలియ‌జేస్తున్న ప‌రిస్థితి. ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే.. మ‌రో దారుణం చోటు చేసుకుంది. తాజా ఘ‌ట‌న దేశంపై మ‌రింత ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

గోవ‌ధ‌.. గోమాంసం వినియోగానికి సంబంధించి వాతావ‌ర‌ణం వేడెక్కిపోవ‌ట‌మే కాదు.. ఈ వేడి ఎక్క‌డో ఉన్న హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ రాఫ్ట్రానికి కూడా అంటింది. ఆ రాష్ట్ర రాజ‌ధాని సిమ్లాకు స‌మీపంలో ఉన్న స‌ర‌హాన్ గ్రామంలో కొంద‌రు వ్య‌క్తులు ఒక వ్య‌క్తిని దారుణంగా హ‌త‌మార్చిన‌ట్లుగా తెలుస్తోంది.

అవుల్ని త‌ర‌లిస్తున్న నోమ‌న్ అనే వ్య‌క్తిని త‌న సోద‌రుడు ఇమ్రాన్ అస్గ‌ర్ ఒక ట్ర‌క్కులో త‌ర‌లిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు నోమ‌న్‌ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అత‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోయింది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వ‌దిలాడు. త‌న సోద‌రుడ్ని కొట్టి.. చ‌నిపోవ‌టానికి కార‌ణం భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లేన‌ని ఆరోపిస్తున్నాడు. గోమాంసంపై హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిషేధం అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో.. గోవ‌ధ నిషేధ చ‌ట్టం కింద అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షించ‌టం స‌బ‌బే కానీ చ‌ట్టానికి విరుద్ధంగా శిక్షించ‌టం.. ప్రాణాలు పోయేలా దాడులు చేయ‌టం ఏ మాత్రం స‌రికాదు.
Tags:    

Similar News