ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లో ఉండే గన్నవరం ఎయిర్ పోర్ట్ కు విమానాల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం చేపట్టిన విధానాలతో పాటు.. ఏపీ రాజధానికి దగ్గరగా ఉండటం.. ఏపీ ప్రభుత్వం విజయవాడకు వచ్చేసిన దరిమిలా గన్నవరానికి విమానరాకపోకలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఉడాన్ పథకం కింద గన్నవరం నుంచి కడపకు ట్రూజెట్ విమాన సర్వీస్ షురూ అయ్యింది. ట్రూజెట్ స్టేషన్ మేనేజర్ గురువారం తాజా సర్వీస్ ను స్టార్ట్ చేశారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాసుల్ని అందజేశారు.
ప్రతిరోజు గన్నవరం నుంచి కడపకు విమాన సర్వీసుల్ని నడపనున్నారు. ప్రతిరోజు ఉదయం హైదరాబాద్ నుంచి 6.45 గంటలకు గన్నవరం చేరుకొని.. ఆ తర్వాత 8.05 గంటలకు గన్నవరం నుంచి కడపపకు బయలుదేరుతుంది. కడపకు ఉదయం 9.10 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో కడప నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి.. గన్నవరానికి 10.35 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత గన్నవరం నుంచి ఉదయం 10.55 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 11.50 గంటలకు చేరుకుంటుంది. మొత్తంగా ప్రతిరోజూ గన్నవరం నుంచి కడప.. కడప నుంచి గన్నవరానికి ప్టైట్లో ప్రయాణించే అవకాశం మొదలైనట్లే.