ఇజ్రాయిల్ పై ఇటీవల ఐక్యరాజ్య సమితిలో చేసిన తీర్మానం సహా పలు అంశాల పై తలెత్తిన విభేదాల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ లో మాట్లాడారు. దీని ఫలితంగా ఇరువురు నేతలు ఒక అవగాహనకు వచ్చారని, వారిద్దరి మధ్య సంభాషణ పూర్తి సానుకూల వాతావరణంలో జరిగిందని శ్వేతసౌధం తెలిపింది. అధికార బదాలాయింపులో భాగంగా పలు అంశాలపై సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు మరికొన్ని వారాలు పరస్పరం టచ్‌లో ఉండాలని ఒబామా-ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వివరించింది.
కాగా తాజా అధ్యక్షుడి ఫోన్ సంభాషణపై ట్రంప్ వివరణ ఇచ్చారు. తాను ఒబామాతో మాట్లాడిన అంశంపై ఫ్లోరిడాలో ట్రంప్ వివరణ ఇస్తూ...ఒబామాతో ఓ చక్కటి సమావేశం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ అంశంపై ఐక్యరాజ్య సమితిలో జరిగే ఓటింగ్ లో తమ దేశం పాల్గొనకూడదని అమెరికా తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ఇటీవలే మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒబామా సర్కారు చొరవ తీసుకొని ట్రంప్ తో చర్చలు జరిపారు.
ఇదిలాఉండగా... అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం క్రిస్మస్-నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో రిసార్ట్ లో గడుపుతున్నారు. అక్కడే ఆయన తన కార్యనిర్వాహక టీమ్ ఎంపికల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ అమెరికా ఎన్నికల నేపథ్యంలో రష్యా జోక్యంపై స్పందించారు. కంప్యూటర్ల హ్యాకింగ్ వ్యవహారంలో తమ దేశ ఇంటలిజెన్స్ ఏజెన్సీలను ఆయన తప్పుబట్టారు. ఈ వివాదం నుంచి రష్యా - అమెరికాలను దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించారు. అయినా, ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలని అన్నారు. తమ ప్రత్యర్థి పార్టీ అయిన డెమొక్రటిక్ నేతలకు సంబంధించిన కంప్యూటర్లు, వ్యక్తుల నుంచి సమాచారం సేకరించి రష్యా హ్యాకర్లు తనకు మద్దతుగా ఆన్ లైన్ లో పోస్టు చేశారన్న అమెరికా ఇంటలిజెన్స్ నివేదికలపై ట్రంప్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. మనుషుల జీవితాల్ని కంప్యూటర్లు మరింత జటిలం చేశాయని వ్యాఖ్యానించారు. ఒక కంప్యూటర్ జీవిత కాలంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/