ట్రంప్‌ తో బీజేపీ అగ్ర‌నేత ఆర్థిక లావాదేవీలు

Update: 2016-11-24 22:30 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యం సాధించిన డొనాల్డ్ ట్రంప్ విష‌యంలో కొత్త వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ట్రంప్ అధ్య‌క్ష ప‌గ్గాలు చేపట్టిన త‌ర్వాత‌ విధానపరంగా భారత్ పట్ల ఎలాంటి వైఖరి అనుసరిస్తారన్న విషయంలో ఇంకా అనిశ్చితి తొలగన‌ప్ప‌టికీ ఆయన వ్యాపారపరంగా ఇండియాతో ఇప్పటికే బలమైన సంబంధాలు కలిగి ఉన్నారని స‌మాచారం. ట్రంప్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం..మన దేశంలో కనీసం 16 భాగస్వామ్యాలు కలిగి ఉంది. అందులో ట్రంప్ బ్రాండ్‌ నేమ్‌ ను వాడుకునేందుకు లైసెన్సింగ్ ఒప్పందాలు కూడా ఉన్నాయని తాజాగా తేలింది.

ట్రంప్ సంస్థల విదేశీ భాగస్వామ్యాలు ఇండియాలోనే అధికమని తాజాగా ప్రచురించిన విశ్లేషణాత్మక కథనంలో వాషింగ్టన్ పోస్ట్  వివ‌రించింది. ట్రంప్‌ కు చెందిన 111 కంపెనీలు దక్షిణ అమెరికా - ఆసియా - మధ్య ఆసియా మార్కెట్లలో వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలతో కలిసి ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ముంబైలో ట్రంప్ టవర్స్ పేరుతో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్టుతో పాటు పుణెలో ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టు - గుర్గావ్‌ లోని హైటెక్ హబ్‌ లో ఆఫీస్ కమ్ రిటైల్ కాంప్లెక్స్ - కోల్‌ కతాలో ఒక రెసిడెన్షియల్ - ఒక కమర్షియల్ టవర్ నిర్మాణ ప్రాజెక్టుల్లో యూఎస్ ప్రెసిడెంట్ వ్యాపార సామ్రాజ్యం భాగస్వామ్యం కలిగి ఉంది. అంతేకాదు కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తితోనూ ఆయనకు ఆర్థిక సంబంధాలున్నాయనేది వాషింగ్ట‌న్ పోస్ట్ క‌థ‌నం. అయితే ఆ ప్ర‌ముఖుడు ఎవ‌ర‌నేది వాషింగ్ట‌న్ పోస్ట్ బ‌య‌ట‌పెట్ట‌లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News