బంగారుపూతతో ఇండియాలో ట్రంప్ టవర్స్!

Update: 2016-08-14 12:37 GMT
తన పదునైన - వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ప్రపంచం మొత్తం పేరుగాంచిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ఏ వ్యక్తీ ఈ స్థాయిలో నోటికి పని చెప్పి ఉండరేమో అనిపించే స్థాయిలో ప్రత్యర్థులపైనా, శత్రుదేశాలపైనా ట్రంప్ విరుచుకుపడుతున్నారు. ఈ రేంజ్ లో చెలరేగిపోతున్న - అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో కొత్త వ్యాపారంలోకి దిగారు. తన దేశంలోనే కాకుండా భారతదేశంలో కూడా తన మార్కు వ్యాపార సామ్రాజ్యంతో నిలబడాలని కోరుకుంటున్నట్లున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ముంబై కేంద్రంగా భారతదేశంలో తన వ్యాపారాన్ని మొదలుపెట్టాలని యోచిస్తున్నాడట.

రియల్ ఎస్టేట్ - కనస్ట్రక్షన్ వంటి ఫుల్ ఫ్రాఫిట్ వ్యాపారం చేయాలని భావించిన ట్రంప్.. ముంబైలో ఏకంగా తన పేరిట "ట్రంప్ టవర్స్" అంటూ బ్రహ్మాండమైన భారీ కట్టడం నిర్మించాలని యోచిస్తున్నాడు. అన్నీ అనుకూలంగా జరిగితే మరో మూడేళ్ళలో ఈయన ప్రాజెక్టులు రెండు ఇండియాలో లో లాంచ్ కానున్నాయి. ఇవి పూర్తైతే ట్రంప్ టవర్స్ లాంటి టవర్స్ ఇండియాలో కట్టడం ఇదే మొదటిసారి అవుతుందని అప్పుడే ఈ టవర్స్ పేరు మారుమ్రోగిపోతుంది.

ఈ రేంజ్ లో చెప్పబడుతున్న ఈ టవర్స్ విశేషాలను ఒక్క సారి పరిశీలిస్తే... ఇది పూర్తిగా 17 ఎకరాల పార్క్ ల్యాండ్ లో 75 అంతస్తులతో నిర్మించబడుతుంది. దాదాపు 800 అడుగుల ఎత్తుగా ఉండే ఈ టవర్స్ కి బంగారపు పూత కూడా ఉంటుందట. ఈ టవర్స్ లో సుమారు 400 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. క్రికెట్ పిచ్, ఏడంచెల సెక్యూరిటీ వ్యవస్థ - థియేటర్ - స్పా బాత్‌ లు - స్విమ్మింగ్ పూల్ - పిక్నిక్ స్పాట్స్ మొదలైనటువంటి హంగులన్నీ ఈ టవర్స్‌ లో ఉంటాయి. ఈ రేంజ్ లో ఉన్న ఈ టవర్స్ లో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ ధర రు. 9.10 కోట్లు ఉంటే.. ఐదు బెడ్ రూంస్ ఫ్లాట్ ధర రూ.10.5 కోట్లవరకూ ఉంటుందట. మరో విషయమేమిటంటే... ఈ టవర్స్ లో ఉన్నవారికి ప్రైవేట్ జెట్ సర్వీస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందట.

ప్రపంచంలో తానో రియల్ ఎస్టేట్ రారాజు కావాలని భావిస్తున్నట్టున్న ట్రంప్.. ఈ టవర్స్ ని గనుక పూర్తిచేస్తే.. కచ్చితంగా ఇదొక భూతల స్వర్గమనే అంటున్నారు రియల్ ఎస్టేట్ దిగ్గజాలు! అయితే.. ఈ టవర్స్ నిర్మాణం 2018 నాటికి పూర్తి కావచ్చునని దీని నిర్మాణ బాధ్యతలు చూస్తున్న లోధీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, మార్కెటింగ్ హెడ్ సముజివాల్ ఘోష్ చెబుతున్నారు.
Tags:    

Similar News