అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ ను నిరసనలు వీడటం లేదు. ఇప్పటికే ట్రంప్ తమ అధ్యక్షుడు కాడంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తుండగా తాజాగా ట్రంప్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా కొత్త చిక్కు వచ్చింది. మన్ హట్టన్ లోని హడ్సన్ నది ఒడ్డున ట్రంప్ సంస్థ కట్టిన నిర్మాణాలన్నింటికీ ట్రంప్ ప్లేస్ అంటూ పేర్లు పెట్టారు. అయితే సదరు పేరును తొలగించాలంటూ అందులో నివసిస్తున్న వాళ్లు ఆందోళన వ్యక్తం చేయడంతో నిర్మాణ సంస్థ దిగిరావడమే కాకుండా బోర్డులను ఊడబీకేయాల్సి వచ్చింది.
ఇంతకీ వాళ్లందరికీ కోపం నషాళానికి అంటడానికి కారణం ఏంటంటే ట్రంప్ నోటి దూలనే. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మహిళల పట్ల అసభ్యకరమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆఖరికి సొంత కూతురును కూడా ఇబ్బందికరమైన పోలికతో ప్రస్తావించారు. ఈ పరిణామాన్ని అమెరికన్ మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తాము నివసిస్తున్న ప్రాంతాలకు ఉన్న పేరు తీసివేయాలంటూ మొత్తం 1325 మంది కుటుంబాల్లో దాదాపు 669 మంది పిటిషన్లు దాఖలు చేశారు. ఆన్ లైన్ వచ్చిన ఈ నిరసనల పర్వానికి తలొగ్గిన నిర్మాణ కంపెనీ బంగారు వర్ణంలో ఉన్న ట్రంప్ ప్లేస్ ల అక్షరాలను తొలగించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/