అమెరికా సైన్యం.. స్వదేశంలో అయినా - విదేశంలో అయినా తమను మించిన హీరోలు లేరన్న రీతిలో స్వాభిమానంతో సాగే బలమైన బృందమది. ఆర్థికంగా - పరపతి పరంగా అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంపై చూపే పెత్తనం వెనుక బలమైన ఆ దేశ ఆర్మీ ఇచ్చే ధైర్యం కూడా ఉంటుంది. సిరియా అయినా - ఆఫ్గనిస్తాన్ అయినా - ఇంకెక్కడైనా కూడా ఒకసారి అడుగు పెడితే చాలు విజయంతోనే వెనుదిరిగే నైజం వారిది. తమ దేశ జాతీయ గీతాన్ని గళమెత్తి పాడే ఆ సైన్యం తాజాగా భారత జాతీయ గీతాన్ని ఆలపించింది. వాద్యాలతో అమెరికా సైనికులు ఆలంపించిన మన జాతీయ గీతం ‘జనగణమన’ వింటూ యావత్భారతం పులకించింది. భారత, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల ముగింపు సందర్భంగా అమెరికాలోనే ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
అమెరికాలోని మెకార్డ్ జాయింట్ బేస్ లూయిస్ వద్ద యుద్ధ అభ్యాస్ విన్యాసాలను నిర్వహించారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 16 వరకు అభ్యాస్ విన్యాసాలు జరిగాయి. ఉత్సాహంగా కొనసాగిన ఈ విన్యాసాలు ముగింపు రోజున.. భారత దేశపు జాతీయ గీతం ‘జనగణమణ’ గీతాన్ని అమెరికా సైనికులు వాయిద్యాలతో పాడి వినిపించారు. అమెరికన్ ఆర్మీ బ్యాండ్ ..భారత జాతీయ గీతాన్ని వినసొంపుగా..ఎక్కడా రిథమ్ పోకుండా చక్కగా ప్లే చేసింది.
అమెరికా సైనికులు జనగణమణ పాటను తమ బ్యాండ్ లో వినిపించడం పట్ల భారతీయ సైనికులు సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను విన్న ప్రతీ ఒక్క భారతీయుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంయుక్త విన్యాసాల్లో భారతీయ మహిళా సైనికులూ పాలుపంచుకున్నారు. రెండు దేశాల సైనిక రంగ నిపుణులూ పాల్గొన్నారు. ఇరు దేశాల సైనిక అనుభవాలను పంచుకుంటూ పరస్పర సహకారానికి ప్రతిన చేశారు.