ట్రంప్ కొడుక్కి 15 నిముషాల్లో కరోనా తగ్గిందట !

Update: 2020-10-28 06:00 GMT
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. ఏది మాట్లాడినా కూడా అదొక సంచలనమే. అలా ఉంటాయి ట్రంప్ మాట్లాడే మాటలు. ప్రతిరోజూ కూడా ఎదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయనిదే ఆయనకి నిద్రపట్టదు. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సాధారణమే. ఇదిలా ఉంటే , ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలా బిజీగా ఉన్నారు. మరోసారి ఎలాగైనా కూడా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని పరితపిస్తూ ..ఓటర్లను అక్షరించే పనిలో మునిగిపోయారు. నవంబర్ మూడు న పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ కి కూడా భారీగానే జరుగుతుంది.

ఇక ఎన్నికల ప్రచార సమయంలో  ట్రంప్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మద్యే ట్రంప్  తన కుమారుడు 14 ఏళ్ల బారన్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది అని వెల్లడించిన సంగతి తెలిసిందే.  బారన్ వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు చెప్పారని, 15 నిమిషాల తరువాత మళ్లీ డాక్టర్లు కరోనా నిర్దారణ పరీక్షలు చేసి  కరోనా నెగటివ్ గా వచ్చింది అని  వైద్యులు చెప్పారని చెప్పారు. అలాగే , పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి బలంగా ఉంటుందని, భయపడాల్సిన అవసరంలేదని, అన్నారు. కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని స్కూల్స్ మూసేయడం మంచి పద్దతి కాదని, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉండవని ట్రంప్ చెప్పారు.  అయితే, అమెరికాలో 7,92,000 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్  వెల్లడించింది. అంతేకాదు, ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 11 శాతం మంది పిల్లలు ఉన్నారని తేల్చి చెప్పింది.  దీంతో స్కూల్స్ విషయంలో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.  ఇక అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ కొంచెం కొంచెంగా  పెరుగుతుంది.
Tags:    

Similar News