ట్విట్టర్ కు ట్రంప్ భారీ వార్నింగ్.. కంట్రోలా? ఖతమా?

Update: 2020-05-29 05:00 GMT
మొండితనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయానికి సిద్ధమవుతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అమెరికా అధ్యక్షుల వారి ట్విట్టర్ ఖాతాకు తాజాగా కొత్త ట్యాగ్ తగిలించటం.. ఫ్యాక్ట్ ఫైండ్ ముద్ర వేయటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రపంచానికే పెద్దన్న దేశాన్ని నడిపే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసే ట్వీట్లలోని నిజానిజాల్ని నిర్దారించుకోవాలన్న ట్విట్టర్ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు షాకిచ్చిన ట్వీట్ పిట్టకు దిమ్మ తిరిగేలా మరో వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ ను నియంత్రిస్తాం.. లేదంటే మూసేస్తామన్న వ్యాఖ్యను చేశారు. వారు మా గొంతు నొక్కేస్తున్నారు.. భారీ చర్య కోసం ఎదురుచూడండి అంటూ చేసిన ట్వీట్ ఉద్దేశం ఏమటన్నదిఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. సోసల్ మీడియాను కంట్రోల్ చేసేలా ఒక అర్డర్ ను ట్రంప్ సర్కారు సిద్ధం చేసినట్లుచెబుతున్నారు. దీనిపై ట్రంప్ సంతకం పెడతారని వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి కైల్ మెకీనాని పేర్కొన్నారు. అయితే.. సోషల్ మీడియాపై ట్రంప్ సంతకం పెట్టే ఫైల్ లో ఏమున్నది బయటకు రాలేదు. పలువురి అంచనాల ప్రకారం ట్విట్టర్ ను మూసివేసే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా కోరే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. ట్రంప్ మరో సంచలనానికి తెర తీసినట్లే. 
Tags:    

Similar News