ఆహుతి అవుతున్న అమెరికా..ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్‌

Update: 2019-01-10 06:55 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. తాత్కాలికంగా ప్ర‌భుత్వం నిలిచిపోయి ఇప్ప‌టికే 19 రోజులు అవుతోంది. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు ట్రంప్ మ‌రో వార్నింగ్ ఇచ్చారు. అవ‌స‌ర‌మైతే నెల‌లైనా.. సంవ‌త్స‌రాలైనా.. పాక్షిక ప్ర‌తిష్టంభ‌న కొనసాగుతుంద‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. తాను ప్ర‌తిపాదించిన బోర్డ‌ర్ వాల్ కోసం నిధుల‌ను కేటాయిస్తేనే ప్ర‌తిష్టంభ‌న వీగిపోతుంద‌న్నారు. స‌రిహ‌ద్దు గోడ నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైతే నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టిస్తాన‌ని కూడా ట్రంప్ హెచ్చ‌రించారు. అయితే ఆ ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించేందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ కూడా అర్థాంత‌రంగా ముగిసింది. డెమోక్ర‌టిక్ నేత‌లతో జ‌రిగిన స‌మావేశం నుంచి ట్రంప్ బైబై అంటూ అక‌స్మాత్తుగా వెళ్లిపోయారు.

ట్రంప్ ప్ర‌తిపాదించిన బోర్డ‌ర్ వాల్‌ ను.. డెమోక్రాట్లు అడ్డుకుంటున్నారు. కొంద‌రు రిప‌బ్లిక‌న్ ఎంపీలు కూడా ట్రంప్ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. కానీ ద్ర‌వ్య బిల్లుకు ఇటీవ‌ల అనుమ‌తి ద‌క్క‌క‌పోవ‌డంతో.. అమెరికా ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు పాక్షికంగా స్తంభించిపోయాయి. స‌రిహ‌ద్దు గోడ‌కు నిధులు కేటాయిస్తేనే .. బిల్లుకు మోక్షం ల‌భిస్తుంద‌ని ట్రంప్ గ‌ట్టి నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నారు. అయితే స్పీక‌ర్‌ నాన్సీ పోలోసీ - న్యూయార్క్ సేనేట‌ర్ చ‌క్ షూమ‌ర్‌ లు ట్రంప్‌ తో ప్ర‌త్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. ష‌ట్‌ డౌన్ నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గాల‌ను ట్రంప్‌ కు వెల్ల‌డించారు. కానీ ట్రంప్ మాత్రం బోర్డ‌ర్ వాల్‌ పై ప‌ట్టుబ‌ట్టి కూర్చున్నారు. స‌రిహ‌ద్దు గోడ‌కు నిధులు ఇస్తున్నారా లేదా అని ట్రంప్ అడిగారు. కాదు అని నాన్సీ స‌మాధానం ఇవ్వ‌డంతో.. బైబై అంటూ ట్రంప్ వెళ్లిపోయారు. దీంతో ప్ర‌తిష్టంభ‌న అలాగే ఉండిపోయింది. సుమారు 8 ల‌క్ష‌ల మంది ఉద్యోగులకు ఈ వారం ఎటువంటి జీతం అంద‌దు. కాగా, ఇదో టైం వేస్ట్ మీటింగ్ అంటూ ఆ త‌ర్వాత త‌న ట్వీట్‌ లో ట్రంప్ సెల‌విచ్చారు.


Full View
Tags:    

Similar News