ప్రపంచవ్యాప్తంగా మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా.. ఇప్పుడు పుట్టబోయే పిల్లలపైనా పెను ప్రభావం చూపుతుందట. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిన వారికి ఈ సూచనలు చేస్తున్నారు.
కొవిడ్ బారినపడి కోలుకున్న వారు ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాల్సిందేనని చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్యవంతులు అయిన తర్వాత మూడు నెలల వరకు పిల్లలను కనే ఆలోచన విరమించుకోవాలని సూచిస్తున్నారు. కరోనా కారణంగా సంతాన సాఫల్యతపై ప్రభావం పడుతుందని అంటున్నారు.
కరోనా వచ్చి తగ్గిన పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోందని వెల్లడించారు. అంతేకాదు.. ఉన్నవాటిలోనూ చురుకుదనం తగ్గిపోతుందని చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిని పరిశీలించగా.. 39 శాతం మందిలో వీర్యకణాలు తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. మహిళల్లో గర్భస్రావం జరిగే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల కొవిడ్ నుంచి బయటపడిన తర్వాత మూడు నెలలు ఆ ప్రయత్నాలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.