లేటుగా అయినా లేటెస్ట్ నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించని తీరులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించటమే కాదు. మరికొందరు సీఎంలకు స్ఫూర్తి నిచ్చే నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి.
తాజాగా కేసీఆర్ ప్రకటించిన నిర్ణయం మోడీ సర్కారుకు షాకిచ్చేలా ఉందని చెప్పాలి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొద్ది సేపటి క్రితం (ఉదయం 11.30గంటల) ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే పుల్వామా ఉగ్ర ఘటనను ఖండిస్తూ కేసీఆర్ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
ఈ దాడి దేశం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తూ.. వీరజవాన్ల కుటుంబాలకు తామంతా అండగా ఉంటామన్నారు. దాడిలో మరణించిన ప్రతి వీర జవాను కుటుంబానికి రూ.25లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు.. ముఖ్యమంత్రులు.. నేతలు.. రియాక్ట్ అయ్యారే కానీ.. ఎవరూ ఇంత భారీ పరిహారాన్ని వీరజవాన్ల కుటుంబాలకు ప్రకటించింది లేదు. వీర జవాన్లకు భారీ పరిహారం ఇవ్వాలన్న సూచన వినిపించినా పట్టించుకున్నది లేదు. అందుకు భిన్నంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల దృష్టి ఆయన మీద పడేలా చేస్తుందని చెప్పక తప్పదు.