కాలం ఎప్పుడూ ఒకేలా అస్సలు ఉండదు. కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ.. వైద్యం కోసం రోగులు కార్పొరేట్.. ప్రైవేటు ఆసుపత్రుల వద్ద కాపు కాయటం.. గంటల కొద్దీ వెయిట్ చేయటం.. బడా క్యూలతో తమను ఎప్పుడు పిలుస్తారో తెలీక తెగ ఇబ్బంది పడుతున్న అరుదైన సన్నివేశం ఇప్పుడు చోటు చేసుకుంది. ప్రధాన మీడియాలో ఇలాంటి వివరాలు రావనుకోండి.
కరోనా సెకండ్ వేవ్ వేళ.. రోగుల వద్ద వైద్యం పేరుతో ఇష్టానికి వసూలు చేసిన ఆసుపత్రులు ఎన్నో. నీతి.. నిజాయితీ.. దర్మంగా వ్యవహరించిన ఆసుపత్రులు అతి తక్కువ. తమకు చేదు అనుభవాల్ని మిగిల్చిన ఆసుపత్రుల సంగతి చూసేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలతో వైద్య ఆరోగ్య శాఖాధికారులను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రుల దుర్మార్గాలను వివరించటమే కాదు.. వారి ఆరాచకాలకు ఆధారాల్ని అందించారు. ఇలాంటి ఆసుపత్రులపై చర్యలకు ఉపక్రమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే.
దీంతో.. డైలీ బేసిస్ లో నిబంధనల్ని ఉల్లంఘించిన ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు మాత్రమే కాదు.. కొవిడ్ సేవల్ని నిలిపివేయాలని.. కొత్త కేసుల్ని తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాసుల వర్షం కురిపించే అవకాశం ప్రభుత్వ నిర్ణయం కారణంగా మిస్ కావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. ఎప్పుడూ బయట పెద్దగా కనిపించని బడా కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు ఇప్పుడు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును కలుస్తున్నారు. డీహెచ్ కార్యాలయానికి తాజాగా కార్పొరేట్ఆసుపత్రుల యజమానులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా తాము అంతా బాగా వ్యవహరించినట్లు వారు చెప్పటం.. వారి మాటలకు భిన్నంగా పేషెంట్లు దాఖలు చేసిన బిల్లుల్ని చూపించి.. ప్రశ్నించటంతో వారి నోట మాట రాలేదని చెబుతున్నారు.
కాకుంటే..తమకు చికిత్స చేసే లైసెన్సుల్ని రద్దు చేయటంపై గుర్రుగా ఉన్న వారు.. న్యాయపోరాటం చేస్తామని వ్యాఖ్యానిచారు. ఉన్నట్లుండి లైసెస్సుల్ని రద్దు చేస్తే తమకున్న పేరు ప్రఖ్యాతులు డ్యామేజ్ అవుతున్నట్లుగా వాపోయారు. ఇంతకూ డీహెచ్ తో భేటీ అయిన ప్రముఖుల్ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. కిమ్స్ హాస్పిటల్ అధినేత భాస్కర్ రావు.. సన్ షైన్ అధినేత గురవారెడ్డితోపాటు.. పలువురు కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు బారులు తీరి.. క్యూ పద్దతిలో డీహెచ్ తో భేటీ అవుతున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న మాటకు తగ్గట్లే తాజా పరిస్థితులు ఉండటం గమనార్హం. కొద్ది రోజుల క్రితం వైద్యం కోసం బాధితులు ఆసుపత్రుల ఎదుట క్యూ కడితే.. తాజాగా అదే కార్పొరేట్ ఆసుపత్రుల ఓనర్లు.. డీహెచ్ ఆఫీసు ముందు పోటెత్తటమే కాదు.. ఆయనతో మాట్లాడేందుకు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి రావటం కాలమహిమ కాక మరేమిటి చెప్పండి?