ఆ ఆదేశాలే ఫైన‌ల్‌.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య‌లు

Update: 2021-12-31 07:26 GMT
మ‌రికొన్ని గంట‌ల్లో జర‌గ‌నున్న నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిం ది. వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యూఇయర్ సెలబ్రెషన్స్పై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారన్న హైకోర్టు.. వాటిని పాటించాలని సూచించింది.

మార్గదర్శకా లు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.అయితే.. ఈ సంద‌ర్భంగా పబ్‌లు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచారని లాయర్లు ధర్మాసనానికి తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కోరారు.

దీనిపై స్పందించిన హైకోర్టు.. పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని వ్యాఖ్యానించిం ది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని పబ్‌లను ఆదేశించింది. జూబ్లీహిల్స్లోని నివాస ప్రాంతాల్లో పబ్‌లను తొలగించాలన్న పిటిషన్‌పై విచారణ జరిపింది.

నివాస ప్రాంతాల్లో పబ్‌లు ఏర్పాటు చేసి.. పార్కింగ్‌ సమస్యలు సృష్టిస్తున్నారని.. విపరీతమైన శబ్ధకాలుష్యానికి కారకులవుతున్నారని స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్‌ శాఖను కూడా ఉన్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది.

జూబ్లీహిల్స్‌ నివాస ప్రాంతాల్లో ఉన్న పబ్‌ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యంతో పాటు ఇతర ఇబ్బందుల నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలు సంవత్సరాంతపు, నయా సాల్‌ వేడుకలకే పరిమితం కాకుండా చూడాలంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

నివాస ప్రాంతాల్లో పబ్‌లుండం సరైన నిర్ణయంకాదని.. డిసెంబరు 31, జనవరి 1లను దృష్టిలో ఉంచుకు ని ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ విచారణను జనవరి 6 కి వాయిదా వేశారు.

అనంతరం పబ్బులు, క్లబ్బులు, హోటళ్లలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై జారీచేసిన మార్గదర్శకాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హైకోర్టుకు సమర్పించారు. ఈ మార్గదర్శకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. వాటిని పాటించాలని పబ్‌లను ఆదేశించింది.

పబ్బుల్లో నూతన సంవత్సరం వేడుకల నిర్వహణకు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు గతంలో ఎన్నడూ లేనన్ని మార్గదర్శకాలను ఈ ఏడాది రూపొందించిందని సంతృప్తి వ్యక్తం చేసింది.

కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పబ్బులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మైనర్లను అనుమతించ వద్దని.. హెచ్చరి కల బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. మద్యం తాగిన తర్వాత వాహనాలు నడపకుండా నిరోధించాలని పబ్బులకు సూచించింది.
Tags:    

Similar News