నీతులు చెప్పటం వేరు. వాటిని ఆచరించటం వేరు. నేను మాట ఇస్తే తప్పను. తేడా వస్తే తల నరుక్కుంటానని చెప్పే కేసీఆర్ మాటలకు చేతలకు మధ్య తేడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకు భిన్నంగా తన తోటిఆర్టీసీ ఉద్యోగుల కష్టాన్ని చూడలేక.. తాను మరణిస్తే ప్రభుత్వం దిగి వచ్చి సమస్యను పరిష్కరిస్తుందన్న ఉద్దేశంతో ఆత్మబలిదానానికి తెగించిన ఖమ్మం శ్రీనివాసరెడ్డి తుది శ్వాస విడిచారు.
తన నివాసం ఎదుట శనివారం కాల్చుకున్న ఆయన 92 శాతం చర్మం కాలిపోయి.. తీవ్రగాయాలతో హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్లు సమాచారం. అయితే.. ఆయన మరణించిన విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
కొద్దిసేపటి క్రితం (ఆదివారం ఉదయం 11 గంటల వేళలో) శ్రీనివాసరెడ్డిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన సీపీఐ నారాయణ.. బయటకు వచ్చి ఆయన మరణించినట్లుగా వెల్లడించారు.దీంతో.. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసు బలగాల్ని భారీగా మొహరిస్తున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.