ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరెన్నికగల ఒలెక్ట్రా కంపెడీ , బీవైడీ అనే ఆటో కంపెనీతో కలిసి తొలిసారి హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించింది. తెలంగాణ ఆర్టీసీకి వీటిని అందించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ లో ప్రవేశపెడుతోంది. బుధవారం ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాతో కలిసి పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ బస్సులను సచివాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. మొదటి విడత 40 బస్సులు అందుబాటులోకి వస్తాయని.. ప్రస్తుతం 5 బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ బస్సులో ప్రజలకు ఎలాంటి శబ్దం రాదని.. కాలుష్యం ఉండదన్నారు. ఈ బస్సులను మొదట శంషాబాద్ విమానాశ్రయానికి నడుపుతున్నామన్నారు.
ఈ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్, బీవైడీ అనే సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయని అరవింద్ కుమార్ తెలిపారు. ఒలెక్ట్రాతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 40 బస్సులను మొదట ప్రవేశపెడతామన్నారు.
జీరోఎమిస్సన్ ఎలక్ట్రిక్ బస్ ఈ-బజ్ కే9 మోడల్ గా పిలిచే ఈ బస్సులను ఒలెక్ట్రా బిడ్ సంస్థ మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేయడం విశేషం. 12 మీటర్ల పొడవు.. 2.5 మీటర్ల పొడువు ఉండే ఏసీ లోయర్ ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్ తో సహా 40మంది ప్రయాణించవచ్చు. 4-5 గంటలు బస్సు బ్యాటరీని మొత్తం చార్జింగ్ చేస్తే 250 కి.మీలు కంటే అదనంగా ప్రయాణిస్తుంది.