అలస్కాలో మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ కాడియెక్ ప్రాంతానికి 150 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. ఈ నేపథ్యంలో యుఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం ......సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఆయా ప్రాంతాల - తీర ప్రాంతాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు - ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. సునామీ వచ్చే అవకాశముండడంతో తమ ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది.
భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైనందువల్ల ఆగ్నేయ ప్రాంతాలతో పాటు.. దక్షిణ అలస్కా - అలస్కా ద్వీపకల్పం - అలూటియన్ దీవులు - కెనడాలోని వెస్ట్ కోస్ట్ ప్రాంతం - బ్రిటీష్ కొలంబియాకు భారీ స్థాయిలో సునామీ ప్రమాదం పొంచివుందని హెచ్చరికలు జారీచేసింది. కాలిఫోర్నియా - ఓరెగాన్ - వాషింగ్టన్ ప్రాంతాలకూ తక్కువ స్థాయిలో సునామీ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడింది. హనోలు ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ప్రకారం.. హవాయి ద్వీపాలు కూడా సునామీ పరిధిలో ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. అలాస్కాలో పెద్ద నగరం అయిన యాంకరేజ్....అక్కడి ప్రజల ప్రాణాలకు - ఆస్తులకు తీవ్రస్థాయిలో ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది.