ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా నిలిచే తిరుమల శ్రీవేంకటేశ్వరుడు కొలువు తీరింది సీమాంధ్రలోనే. నిత్యం హుండీ కలెక్షన్ల ద్వారానే సరాసరిన రూ.2 నుంచి రూ.3కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి.
వివిధ రూపాల్లో దేవాలయానికి వచ్చే కోట్లాది రూపాయిల్ని ధార్మిక కార్యక్రమాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపడుతుంటారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తుంటారు కూడా. తాజాగా వెయ్యి కాళ్ల మండపాన్ని ఏడు కొండలపై నిర్మించాలని.. అద్భుతమైన కట్టడాన్ని పున:సృష్టించాలని టీటీడీ భావిస్తోంది.
ఆలయ ప్రధాన ద్వారానికి 14వ శతాబ్ధంలో నాటి సాళువరాజు భక్తుల కోసం సువిశాల మండపాన్ని నిర్మించారు. అయితే.. వివిధ కారణాలతో ఈ కట్టటం కూలటం.. కూల్చేయటం జరిగింది. ఈ కట్టడం తాలూకూ స్తంభాలు ఇప్పటికి నారయణగిరి ఉద్యాన వనం వద్ద కనిపిస్తాయి. వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలంటూ భక్తులు పెద్ద ఎత్తున కోరుతున్న నేపథ్యంలో.. వెయ్యి కాళ్ల మండపానికి సంబంధించిన కొన్ని నమూనాలు సిద్ధం చేశారు.
ఇదిలా ఉంటే.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఏపీ రాజధాని అమరావతి నగరంలో ఏం చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీవారి ముద్ర కనిపించేలా అమరావతిలో టీటీడీ భారీ ప్రాజెక్టును నిర్మిస్తే అద్భుతంగా ఉంటుందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత లేని టీటీడీ కానీ అనుకోవాలే కానీ.. అద్భుతాల్ని సృష్టించే వీలుంది.
ప్రపంచంలో అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని చేయాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి.. టీటీడీ సాయంతో అమరావతిలో భారీ దేవాలయాన్ని.. అధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఒక నిర్మాణాన్ని చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. మరి.. టీటీడీనే ఇందుకు పూనుకుంటుందా? లేక.. ఏపీ సర్కారు జోక్యంతో ముందుకు వస్తుందా? అన్నది చూడాలి. ఏపీ రాజధానిలో శ్రీవారి ముద్రలు ఉండటానికి మించిన శుభకరమైన అంశం ఏముంటుంది?