తలనీలాల అక్రమ రవాణాపై స్పందించిన టీటీడీ

Update: 2021-03-30 12:27 GMT
ఏపీలో ప్రస్తుతం తిరుమల శ్రీవారి తలనీలాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం దుమారం రేపుతోంది. టీటీడీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాదంపై టీటీడీ తాజాగా వివరణ ఇచ్చింది.

తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో  మయన్మార్ దేశ సరిహద్దుల్లో అస్సాం రైఫిల్స్ సైన్యం ఓ ట్రక్కుల్లో తరలిస్తున్న రెండు కోట్ల విలువైన తలనీలాల అక్రమ రవాణాను పట్టుకున్నారు. 120 బ్యాగుల తలనీలాలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని రాష్ట్రంలో తిరుమల శ్రీవారి తలనీలాల అక్రమ రవాణాపై టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.

అస్సాం రైఫిల్స్ పట్టుకున్న 120 బ్యాగుల తలనీలాలపై స్పందించిన టీటీడీ బోర్డు ఈ తలనీలాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.

శ్రీవారికి సమర్పించిన తలనీలాలను అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని టీటీడీ బోర్డు తెలిపింది. అయితే జీఎస్టీ కట్టిన బిడ్డర్ ఆ తలనీలాలను ఎక్కడికి తీసుకువెళుతాడు ఎవరికి విక్రయిస్తారు అనే దాంతో టీటీడీకి సంబంధం లేదని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ అనుమతులు ఉన్నాయా? లేదా అన్నదానితో కూడా తమకు ఎలాంటి సంబంధం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

టీటీడీ ప్రతి మూడు నెలలకు ఒకసారి టెండర్ ద్వారా తలనీలాలకు విక్రయిస్తుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థ తలనీలాలను ఎక్కడికి తీసుకెళుతారు? ఏ దేశాలలో విక్రయిస్తారనే దానిపై తమకు సంబంధం లేదని టీటీడీ తెలిపింది.
Tags:    

Similar News