సిద్ధాంతపరంగా తమ బద్దశత్రువు అయిన కాంగ్రెస్‌తో దోస్తీ కుదుర్చుకొని మరీ మహాకూటమి రూపంలో రాబోయే ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేస్తోంది. సీట్ల విషయంలో మిగతా పార్టీలైన టీజేఎస్ - సీపీఐ బెట్టుమీద ఉంటున్నప్పటికీ... ``పొత్తు ముఖ్యం...సీట్ల గురించి ఆందోళన వద్దు`` అంటూ సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ప్రకటించిన నేపథ్యంలో సైకిల్ పార్టీకి చెందిన నాయకులు తాము బరిలో దిగే స్థానాల గురించి ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారు.
టీడీపీకి చెందిన నాయకుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ నాయకులు పోటీ చేయనున్నారు. అయితే, వీటిలో వనపర్తిలో చిన్నారెడ్డి బరిలో దిగడం - రాజేంద్రనగర్ స్థానాన్ని కూడా టీడీపీ కోరుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల కోసం ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా చర్చల్లో ఈ సీట్లపై చర్చలు ఫలిస్తే...పేర్లు ఖరారు కావచ్చునని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీనేతలు తాము పోటీ చేసేందుకు సిద్ధమైన స్థానాలు ఇవే..
శేర్‌లింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్
కుకట్‌పల్లి- పెద్ది రెడ్డి
ఉప్పల్- వీరేంద్ర గౌడ్
కుత్భుల్లాపూర్ -అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్
రాజేంద్రనగర్- గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి
జూబ్లీహిల్స్ - అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి
ఖమ్మం - నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య
అశ్వరావు పేట - మచ్చ నాగేశ్వరరావు
మక్తల్ - కొత్త కోట దయాకర్ రెడ్డి
దేవరకద్ర - సీతా దయాకర్ రెడ్డి
జడ్చర్ల - ఎర్ర శేఖర్
వనపర్తి - రావుల చంద్రశేఖర్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ -మండవ వెంకటేశ్వర రావు
కోరుట్ల - ఎల్ రమణ