తెలంగాణలో ఎదురే లేకుండా సాగుతున్న టీఆరెస్ ప్రభుత్వంపై యుద్దానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కరువు యాత్ర పేరుతో టీటీడీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. మరో రెండు రోజుల్లో జనంలోకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
ఈ నెల 18 నుంచి 25 వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో కరువు యాత్రలు ఏకకాలంలో చేపట్టడానికి టీటీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఏకకాలంలో చేపడుతున్న ఈ యాత్రల కోసం పది జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు వేశారు. ఆ కమిటీలు జిల్లాల్లో పర్యటించి అక్కడి కరువుపై జిల్లా కలెక్టర్లకు నివేదిక అందజేస్తాయి. నివేదికలు పరిశీలించిన తర్వాత కరువు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లను కోరతారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే... కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని రావుల చెబుతున్నారు.
టీటీడీపీ నేతలంతా టీఆరెస్ లో చేరిపోవడంతో టీటీడీపీ బాగా బలహీనపడిపోయింది. ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా నీరసించిపోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పుంజుకోవడం కోసం పార్టీలో ముఖ్య నేతలు దీన్ని సాధనంగా ఉపయోగించుకోనున్నారు. కార్యకర్తలు - శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి... ప్రభుత్వంలో లోపాలను ప్రజలకు వివరించడానికి ఈ కరవు యాత్రలను ఉపయోగించుకోవాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో కరవు తీవ్రత నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు మైలేజి ఇస్తుందో చూడాలి.