తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ గుర్రుగా ఉన్నదిట. అసలే తామంతా ఒక వైపు ముఖ్యమంత్రి కెసిఆర్ అసమర్థ, అరాచక పాలన గురించి ఎడా పెడా పోరాటాలు సాగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి కాస్త ప్రాణవాయువు పోయాలని అనుకుంటూ ఉంటే.. మరోవైపు సుజనా చౌదరి.. కేసీఆర్ ను చంద్రబాబుతో సమానంగా సమర్థుడైన నాయకుడు అన్నట్లుగా కీర్తించడం.. వారికి మంటగా ఉన్నదిట. తమ పార్టీకి చెందిన నాయకుడే కేసీఆర్ ను అలా పొగుడుతూ ఉంటే ... ఇక రాష్ట్రంలో తమ పోరాటాలకు విలువేముంటుందని వారు వాపోతున్నారుట.
కొద్ది నెలల తేడాతో ఎంతలో ఎంత మార్పు? ఓటుకు నోటు కుంభకోణం సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అప్పాయింట్ మెంటుకు తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి ఉన్నట్లుండి అదే కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించి దిగ్భ్రాంతి కలిగించారు. ఈ ప్రశంస సందర్భం ఏదైనా కావచ్చు కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటా మంతీ లేకుడా కాలం గడిచిపోతున్న దశలో పొరుగు రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నేత నేరుగా కేసీఆర్‌ను మోసేయడం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు చికాకు కలిగించింది.
విషయమేమిటంటే, హైదరాబాద్ సురభి ఎడ్యుకేషనల్ సొసైటీలో సౌర విద్యుత్ పై కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ సమర్థ పాలకులేనని తమ ప్రజల అభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నారని కితాబునిచ్చారు. భవిష్యత్ అగ్రరాజ్యంగా భారత్ ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు.
ఆయన ఆశాభావం మాటేమిటో కానీ, ఎంకి పెళ్లి సుబ్బడి చావు సుజనా నోటి వెంట తాము బద్ధ శత్రువుగా చూస్తున్న కేసీఆర్ పై ప్రశంసలు రావడం టీటీడీపీ నేతలకు షాక్ కలిగించాయి. ముందుముందు ఇలాంటి అనాలోచిత ప్రశంసలకు వెళ్లకుండా.. ఒక హెచ్చరిక చేయాలని పార్టీ అధినేత చంద్రబాబుకు వారు సుజనాపై ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.