గమనించారా; రేవంత్‌ ఇష్యూను తమ్ముళ్లు లైట్‌ అంటున్నారు

Update: 2015-06-11 04:28 GMT
నిన్నమొన్నటివరకూ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఇష్యూను పార్టీ నేతలు ఒకరి తర్వాత బ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఉన్నట్లుండి ఆ విషయంలో కాస్త తేడా కనిపిస్తోంది. ఈ మార్పు బుధవారం ఉదయం నుంచి మొదలైంది.

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌ వీడియో టేపులు ఒక విధమైన సంచలనం సృష్టిస్తే.. వారం తర్వాత విడుదలైన బాబు ఆడియో టేపులుగా చెబుతున్నవి విడుదలై మరోసారి సంచలనం సృష్టిచటం తెలిసిందే. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోరాటం మరింత ముదిరిపోయింది. ఒకరికొకరు వ్యక్తిగత సవాళ్లు విసురుకునే వరకూ వెళ్లింది.

రెండు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ముఖాముఖిన తలపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ రేవంత్‌ ఉదంతంపై మాట్లాడిన తెలుగు తమ్ముళ్లు.. ప్రత్యేకించి ఏపీ తెలుగుదేశం నేతలు.. ఇప్పుడు రేవంత్‌ వ్యవహారాన్ని కోర్టు చేసుకుంటుందని.. ఆ విషయం తమకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం కనిపిస్తోంది.

ఇప్పుడు తమ్ముళ్ల టార్గెట్‌ మొత్తం చంద్రబాబును సేఫ్‌ చేయటం మీదనే దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తమ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తెలంగాణ సర్కారు ట్యాపింగ్‌కు పాల్పడిందన్న విమర్శలను తీవ్రతరం చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లను ఏ విధంగా ట్యాప్‌ చేస్తారన్న దానిపై వారు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు ఆడియో టేపుగా చెబుతున్నది బయటకు వచ్చిన నాటి నుంచి రేవంత్‌ మీద ఫోకస్‌ తగ్గి.. బాబు అంశానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ విమర్శల తీవ్రతను పెంచటం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి రేవంత్‌ ఇష్యూ కాస్త సైడ్‌ ట్రాక్‌ పట్టినట్లుగా కనిపిస్తోంది.

Tags:    

Similar News