ఇంత‌టి మ‌భ్య‌పెట్టే రాజ‌కీయం బాబుకే సాధ్యం

Update: 2018-09-06 04:15 GMT
ఆ పార్టీ పేరు....తెలుగుదేశం. తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్ద‌లు అవ‌మానం చేశార‌ని విశ్వవిఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. సునామీలా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టారు. అయితే, అనంత‌రం ఆయ‌న చేతుల్లోనుంచి పార్టీని త‌న గుప్పిట్లోకి అప్ర‌జాస్వామిక విధానంలో చేజిక్కుంచుకున్న చంద్ర‌బాబు...పార్టీ మూల సిద్ధాంతాల‌నే ఎన్నో వేదిక‌ల మీద తాక‌ట్టు పెట్టారు. తాజాగా పార్టీ ఏర్పాటుకు అర్థం లేకుండా చేయ‌డంలో భాగంగా కాంగ్రెస్‌ తో పొత్తుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా మ‌భ్య‌పెట్టే రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. ఒకేరోజు సాక్షాత్తు చంద్ర‌బాబు విడుద‌ల చేయించిన ప్ర‌క‌ట‌న‌ - తెలుగుదేశం పార్టీ నేత‌లు చేసిన ప‌ని ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు.

తెలంగాణ‌లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. అధికార టీఆర్ ఎస్‌ - ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఈ ఎన్నిక‌ల‌పై దూకుడు మీద ఉన్నాయి. అయితే, తెలంగాణ‌లో అడ్ర‌స్ కూడా లేని స్థితికి చేరిన తెలుగుదేశం పార్టీ త‌న ఉనికి చాటుకునేందుకు సిద్ధ‌మ‌యింది. ఎప్ప‌ట్లాగే...టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు త‌నదైన శైలిలో మీడియాకు ఓ లీక్ ఇచ్చారు. ఈనెల 8న హైదరాబాద్‌ వెళ్లనున్నాన‌ని - ఆ రోజు మధ్యాహ్నం టీటీడీపీ నేతలతో బాబు భేటీ అయి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు - పొత్తులపై ప్రాథమిక స్థాయిలో చర్చిస్తాన‌ని మీడియాకు వెల్ల‌డించారు. సున్నితమైన అంశాలైన పొత్తుల‌ విషయంలో పార్టీకి ఇబ్బంది కలిగించే రీతిలో వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీకి సంబంధించిన విషయాలపై నేరుగా తనతోనే మాట్లాడాలని ఆయన చెప్పారని టీడీపీ వ‌ర్గాలు లీకులిచ్చాయి.

మరోవైపు బాబు పేరుతో వెలువ‌డిన ఈ ప్ర‌క‌ట‌ల‌న‌కు కొద్ది గంట‌ల అనంత‌ర‌మే...కీల‌క‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియాతో తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ స‌మావేశ‌మ‌య్యారు. హైదరాబాద్‌ లోని గోల్కొండ హోటల్ లో కుంతియాతో బుధ‌ర‌వారం రాత్రి ఎల్.రమణ స‌మావేశం అయ్యారు. కాంగ్రెస్‌ తో తెలంగాణ టీడీపీ పొత్తుపై చర్చ జ‌రిగింద‌నేది  ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ``బాబుకు తెలియ‌కుండానే ఈ స‌మావేశం జ‌రిగిందా?`` అనే సందేహం కూడా అవ‌స‌రం లేదు. ఎందుకంటే..పార్టీ అధ్య‌క్షుడు...మ‌రో పార్టీ ఇంచార్జీతో స‌మావేశం అవ‌డం అధ్య‌క్షుడికి తెలియ‌కుండా జ‌రిగే ప‌ని కాదు. ఈ భేటీ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేస్తున్న అక్ర‌మ పొత్తుల వ్య‌వ‌హారం తేట‌తెల్లం అయింద‌ని - ఎన్టీఆర్‌ కు రాజ‌కీయ వెన్నుపోటు పొడిచిన నాయ‌కుడు...నేడు ఆ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాల‌కు తిలోద‌కాలు ఇచ్చార‌ని స‌హ‌జంగానే టీడీపీ అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు.


Tags:    

Similar News