తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే బహిష్కృత నేత.. చిన్నమ్మకు బంధువైన టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
నిన్న మొన్నటి వరకూ అన్నాడీఎంకే పార్టీ గుర్తు అయిన రెండాకుల చిహ్నాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకుంటామని.. అందుకోసం ఏం చేయటానికైనా సిద్ధమేనని ప్రకటించిన దినకరన్ ఈ రోజు ఊహించని నిర్ణయాన్ని వెల్లడించారు. పుదుచెర్రిలో తన మద్దతుదారులతో భేటీ నిర్వహిస్తున్న దినకరన్.. తన కొత్త పార్టీ ముచ్చటను తెర మీదకు తీసుకొచ్చారు.
అన్ని అనుకున్నట్లు సాగితే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పుట్టిన రోజు సందర్భగాకొత్త పార్టీని ప్రారంభిస్తారని చెబుతున్నారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాల్ని చిన్నమ్మ అందుకోవటం.. ఆ తర్వాత అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. ఆ సమయంంలో తనకు విదేయుడిగా ఉండే పళనిస్వామికి అధికారాన్ని అప్పజెప్పారు. తర్వాతి కాలంలో చిన్నమ్మకు బద్ధ శత్రువుగా మారిన పన్నీరు సెల్వంతో పళనిస్వామి చెట్టాపట్టాలు వేసుకోవటం.. దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించటం లాంటివి జరిగాయి.
ఇటీవల జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ సంచలన విజయం సాధించటం.. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆర్నెల్ల వ్యవధిలో పళని ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కొత్త పార్టీని త్వరలో ప్రారంభించేందుకు వీలుగా తన మద్దతుదారులతో దినకరన్ మంతనాలు మొదలు పెట్టటంతో తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.