అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పార్టీలో తన పెట్టు పెంచుకునే ఎత్తుగడలను మళ్లీ మొదలుపెట్టారు. ఎలక్షన్ కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన దినకరన్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎఐఎడిఎంకె (అమ్మ) పార్టీలో తాను యథావిధిగా కొనసాగుతానని టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. తాను పార్టీలోనే ఉన్నానని, తనను తొలగించే అధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు తప్ప మరెవరికీ లేదని ఆయన అన్నారు.
ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వడంలో దొరికిపోవడంతో అరెస్టవడం, పార్టీ విలీనం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం పట్టుపట్టడంతో శశికళ వర్గంలోని నేతలను బహిష్కరిస్తున్నట్లు పళనిస్వామి వర్గం తెలిపింది. దీనికి స్పందించిన దినకరన్ ఆ సమయంలోనే తాను పదవిని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యవహారాలనుంచి తాను వైదొలగుతున్నానని ప్రకటించిన సుమారు నెలన్నర తర్వాత మీడియా ముందుకు వచ్చిన దినకరన్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోనే ఉన్నానని, మధ్యలో ఢిల్లిలో తనను అరెస్టు చేయడం వల్ల కొంత విరామం వచ్చిందని దినకరన్ అన్నారు. తనను పార్టీ నుంచి ఎవరూ తొలగించలేదని, ప్రధాన కార్యదర్శి శశికళ తప్ప మరెవ్వరూ తనను అన్నాడీఎంకేకు దూరం చేయలేరని స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా.... బెయిల్ దొరికిన అనంతరం రాష్ర్టానికి వచ్చిన దినకరన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని మంత్రులు ఆసక్తి చూపించడం లేదు. పళనిస్వామి వర్గంలో ముఖ్య నేతగా ఉన్న రాష్ట్ర మత్స్య, ఆర్థికశాఖ మంత్రి డి.జయకుమార్ ఈ విషయం బహిరంగంగా స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం పని చేయనుందని, తమ వెనుక సూత్రధారులెవరూ లేరని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో త్వరలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని జయకుమార్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/