రాక్ష‌సుల‌కు ర‌ఫ్ ట్రీట్‌ మెంట్‌

Update: 2015-11-02 07:13 GMT
ఈజిప్టులోని సినాయ్‌ దీవుల్లో రష్యా విమానం కుప్ప‌కూల‌డం అందులోని ప్రయాణికుల్లోని 224 మందిలో ఏ ఒక్కరూ మిగల‌క‌పోవ‌డం అత్యంత విషాద‌క‌ర ఘ‌ట‌న‌. అప్ప‌టివ‌ర‌కు తుళ్లుతూ పాడుతూ ఎంతో సరాదాగా టూరిస్టు స్పాట్‌ ల్లో గడిపిన వారంతా నేల‌రాలారు.  ఈ ఘ‌ట‌న ప్ర‌పంచాన్ని క‌లిచివేస్తే... ఆ దుర్మార్గానికి తామే కార‌ణ‌మంటూ అంత‌ర్జాతీయ రాక్ష‌స ఉగ్ర‌వాద సంస్థ ఇస్టామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఆండ్ సిరియా ప్ర‌క‌టించింది. అంతే కాదు అందుకు త‌గిన వీడియోను కూడా ఇంట‌ర్నెట్ లో పెట్టింది. త‌ద్వారా త‌మ రాక్ష‌సత్వాన్ని చాటుకుంది. అయితే ఐఎస్ ఐఎస్ పీచ‌మ‌ణిచేలా వారి స్థావ‌రాల‌పై విమాన‌దాడులు జ‌రిగాయి.

అమెరికా - టర్కీలు సిరియాలో జరిపిన ఈ వైమానిక దాడిలో ఇస్లామిక్‌ స్టేట్‌ కు చెందిన ఉగ్రవాదులు 50 మంది హతమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాదళాలను ఉటంకిస్తూ ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ 'అనదోలు ఏజెన్సీ' తెలిపింది. టర్కీకి చెందిన జెట్‌ విమానాలు సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలు లక్ష్యంగా దాడి చేశాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఆ వార్తాసంస్థకు వెల్లడించారు. ఆరు ఎఫ్‌-16 జెట్‌ విమానాలు దక్షిణ టర్కీలోని ఇన్‌ సర్కిలిక్‌ స్థావరంనుంచి బయలుదేరి దాడికి పాల్పడ్డాయని అనదోలు సంస్థ పేర్కొంది. ఈ దాడిలో సిరియా సరిహద్దుల వెంట సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇస్లామిక్‌ స్టేట్‌ కు చెందిన ఎనిమిది స్థావరాలు ధ్వంసమయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలని టర్కీ ప్రజలు నిర్ణయించుకోవ‌డం....వీటిని నిర‌సిస్తూ ఐఎస్ ఐఎస్ నిరంకుశ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం తెలిసిందే.

రాక్ష‌స సంత‌తి 224 మందిని పొట్ట‌న‌పెట్టుకున్న‌ త‌ర్వాత వారిని అంతం చేయ‌డమే ల‌క్ష్యంగా జ‌రిగిన ఈ దాడిపై అంత‌ర్జాతీయ స‌మాజం హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది.
Tags:    

Similar News