తమిళనాడు పాలిటిక్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే స్టింగ్ ఆపరేషన్ ఒకటి బయటకు వచ్చింది. అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ అలియాస్ జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వివరాలు సంచలనంగా మారటమే కాదు.. తమిళ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకూ క్లీన్ చిట్ ఉన్నట్లుగా ప్రచారం జరిగే మాజీ ముఖ్యమంత్రి.. అమ్మ విధేయుడు పన్నీరు సెల్వం అసలు రూపాన్ని బయటపెట్టేలా స్టింగ్ ఆపరేషన్ ఉండటం.. ఇందులో పన్నీర్ తో పాటు.. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పళనిస్వామి యవ్వారం కూడా బయటకు తీసుకొచ్చింది.
ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో పన్నీర్.. పళని ఇద్దరూ దొరికిపోవటమే కాదు.. అధికారం కోసం ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించారో ఇట్టే అర్థమయ్యేలా చేస్తుంది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశ్వాస పరీక్ష సందర్భంగా.. ఎమ్మెల్యేల బేరసారాలు భారీగా సాగినట్లుగా తాజాగా బయటకు వచ్చిన వీడియో స్పష్టం చేస్తోంది.
ముఖ్యమంత్రి సీటును సొంతం చేసుకునేందుకు పన్నీర్ సైతం భారీగా పావులు కదపటమే కాదు.. తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలకు కోటి రూపాయిల చొప్పున ఇస్తానంటూ ఆఫర్ చేయగా.. పళనిస్వామికి మద్దతుగా నిలిచే ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల రూపాయిల మొత్తం.. బంగారం ఇవ్వటం జరిగిందన్నది తేలింది.
ఈ వివరాలన్నీ దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ కెమేరా సాక్షిగా చెప్పటంతో పన్నీర్.. పళనిలు అడ్డంగా బుక్ అయిన పరిస్థితి. తనకు రూ.6 కోట్లు ఇస్తామని కెమెరా సాక్షిగా ఆయన చెప్పటం.. ఆ వీడియో ఇప్పుడుబయటకు రావటం సంచలనంగా మారింది. తనకొచ్చిన ఆఫర్ ను చెప్పిన శరవణన్.. ముగ్గురు ఎమ్మెల్యులకు ఎంతెంత ముట్టాయో కూడా చెప్పారు. ఎమ్మెల్యేలు తనియవరసు.. కరుణసు.. ఏకే బోస్ లకు రూ.10 కోట్ల చొప్పున ముట్టాయని సదరు ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో వెలుగులోకి వచ్చింది. అధికారాన్ని నిలుపుకోవటం కోసం ఎమ్మెల్యేలతో భారీ క్యాంప్ ను కూవత్తూర్ గోల్డెన్ బే రిసార్ట్స్ సాక్షిగా జరగటం తెలిసిందే. ఈ సందర్భంగా క్యాంప్ నుంచి తప్పించుకు వచ్చిన శరవణన్ పెను దుమారాన్నే రేపారు. తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. పళనిస్వామి వర్గం తనకు ఇస్తానని చెప్పిన ఆఫర్ ను ఇవ్వకపోవటంతోనే శరవణన్ ఇలా వ్యవహరించారని చెబుతున్నారు. ఏమైనా.. అధికారం కోసం పన్నీర్.. పళనిలు ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా బేరసారాలు నడిపారన్న చేదునిజం బయటకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరీ.. స్టింగ్ ఆపరేషన్ ప్రకంపనాలు తమిళనాడు అధికారపక్షాన్ని ఎంతగా దెబ్బ తీస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/