ఒకప్పటికీ ఇప్పటికీ టివి ఛానల్స్ లో ట్రెండ్ చాలా మారిపోరింది. ఒకప్పుడు శ్రీరామనవమి అంటే 'సంపూర్ణ రామాయణం' సినిమా.. వినాయక చవితి అంటే 'వినాయక విజయం'.. క్రిస్మస్ అంటే 'కరుణామయుడు' వంటి సినిమాలు వచ్చేవి. అలాగే.. ఉదయం నుంచి సాయంత్రం నుంచి వరకూ ఆయా పండుగలకు సంబంధించిన పాటలు.. స్తోత్రాలు.. కార్యక్రమాలు మాత్రమే కనిపించేవి.
ఇక పండుగ గురించి చెబుతూ సెలబ్రిటీలతో నిర్వహించే ప్రోగ్రామ్స్ కు అయితే అంతు ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు మాత్రం టీవీ ఛానల్స్ ట్రెండ్ తెగ మారిపోయింది. పండుగ రోజున.. పర్టిక్యులర్ గా ఆయా సినిమాలనే ప్రదర్శించాలనే రూల్ ఏమీ పెట్టుకోవడం లేదు ఛానల్స్. రేపు వినాయక చవితి పండుగ. దేశం మొత్తం గొప్పగా జరిగే వేడుకల్లో గణేష్ చతుర్ధి కూడా ఒకటి. రెండు మూడేళ్లుగా ఛానల్స్ వాలకం చూస్తుంటే.. ఆయా యాంకర్ల గెటప్స్ లో మినహాయిస్తే.. ప్రోగ్రామ్స్ లో పండుగ వాతావరణం కనిపించడం మానేసింది. కార్యక్రమం ప్రారంభంలో యాంకర్ తో ఒక్క లైన్ వినాయక చవితి విషెస్ చెప్పేసి.. తరువాత యథావిధిగా తమ ప్రోగ్రామ్ ను కంటిన్యూ చేసేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అసలు దైవత్యం అనే ఫీలింగే బొత్తిగా పట్టించుకోవడం లేదు.
అఫ్ కోర్స్.. జనాలు కూడా దేవుడు అనే కాన్సెప్ట్ ను అంతగా ఆదరించడం లేదనే వాదన కూడా ఉంది. ఓం నమో వేంకటేశాయ అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మూవీ.. డిజప్పాయింట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో మాదిరిగి దైవత్వం అనే థీమ్ కు జనాల నుంచి ఆదరణ లభించడం లేదని మూవీ మేకర్స్.. ఛానల్స్ నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు అన్ని ఛానల్స్ లోను తమ ఛానల్ లో వేసే సినిమాల ప్రోమోలను రిలీజ్ చేశాయి. ఇవన్నీ రీసెంట్ టైంలో సూపర్ హిట్స్ గా నిలిచిన మూవీస్ కావడం గమనించాలి. అయితే.. కమర్షియల్ యాంగిల్ నుంచే సినిమాలు తీస్తుండడం.. ఛానల్స్ నిర్వహిస్తుండడం కూడా.. ఇలా దేవుళ్లు అనే కాన్సెప్ట్ ను పక్కన పెట్టడానికి కారణం అనే వాదనను కూడా కొట్టి పారేయలేం! అటు జనాలు అయితేనేమి.. ఇటు ఛానల్స్ అయితేనేమి.. దేవుళ్ల విషయంలో ట్రెండ్ మారిందనే మాట మాత్రం వాస్తవమే.