టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్ట్

Update: 2019-10-05 08:17 GMT
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ తోపాటు టీవీ9 మాజీ ఉద్యోగి అయిన కేవీఎన్ మూర్తిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. టీవీ9లో అవకతవకలపై నమోదైన కేసుల విచారణలో భాగంగా గతంలో టీవీ9 స్టూడియోకి వచ్చిన పోలీసులను బెదిరించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఆ సమయంలోనే రవిప్రకాశ్ పై కేసు నమోదు చేశారు బంజరాహిల్స్ పోలీసులు. ఆ కేసులలో పలుసార్లు పోలీస్ స్టేషన్ కు రమ్మని నోటీసులు ఇచ్చారు. అయినా రవిప్రకాష్ నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

రవిప్రకాష్ - మూర్తి లిద్దరూ దాదాపు 12 కోట్ల రూపాయల టీవీ9 నిధులను స్వాహా చేశారని అలందా మీడియా గతంలో ఫిర్యాదు చేసింది. మరో ఉద్యోగి పెరీరా కూడా 6 కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ చేసినట్టు సమాచారం. రవిప్రకాష్ బృందం మొత్తం 18 కోట్ల రూపాయాలు గోల్ మాల్ చేసినట్టు అలంద మీడియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ ఫోర్జరీ - చీటింగ్ కేసులలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు రవిప్రకాష్. ఇక పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో నోటీసులకు స్పందించకపోవడంతో తాజాగా అరెస్ట్ అయ్యారు.

ఇక తనపై వరుస కేసులు నమోదుకావడం.. దీనివెనక ప్రముఖ వ్యాపారవేత్త పీవీపీ ఉన్నారనే ఆరోపణలను గతంలో రవిప్రకాష్ చేశారు. తాజాగా నిన్న అర్ధరాత్రి వ్యాపారవేత్త పీవీపీపై బండ్ల గణేష్ తో పాటు ఆయన అనుచరులు దాడి చేయడం వెనుక రవిప్రకాష్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
Tags:    

Similar News