జగన్ ను అభినందిస్తే తప్పేంటి అంటున్న రత్నప్రభ

Update: 2021-03-28 10:42 GMT
తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె గతంలో కర్ణాటకలో ఐఏఎస్ గా పనిచేసినప్పుడు సీఎం జగన్ ను అభినందించిన ఒక ట్వీట్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ను వైసీపీతోపాటు టీడీపీ సోషల్ మీడియా వారు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. రత్నప్రభ జగన్ మనిషి అంటూ ప్రచారం మొదలుపెట్టారు.

తాజాగా ఈ అంశం మీద రత్నప్రభ స్పందించారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జగన్ సీఎంగా గెలిచినప్పుడు నేను అభినందిస్తూ ట్వీట్ చేసిన మాట వాస్తవం అన్నారు. అలా అభినందిస్తే తప్పేముంది అని ప్రశ్నించారు.

జనసేన పార్టీ మాకు 200శాతం మద్దతు ఇస్తోందని రత్నప్రభ తెలిపారు. ప్రజలు డబ్బులు తీసుకొని అవినీతి పరులు ఓటు వేయద్ది అన్నారు. రేపే నామినేషన్ వేస్తానని నేను గెలిస్తే మీ సమస్యలను పార్లమెంట్ లో గట్టిగా నిలదీస్తానని అన్నారు. వైసీపీని గెలిపిస్తే ధైర్యంగా మాట్లాడే వారు ఎవరూ లేరని ఆమె అన్నారు.  

సొంత రాష్ట్రం మీద అభిమానంతో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్నానని అన్నారు. నేను ఎంపీగా గెలిస్తే పార్లమెంట్ లో ఇక్కడి సమస్యల గురించి ధైర్యంగా మాట్లాడుతానని అన్నారు.

మనకంఠం పార్లమెంట్ లో వినిపిస్తానన్న ఆమె వైసీపీలో 22 మంది ఎంపీలు ఉన్నారని.. ఒక్క ఎంపీ అయినా వాళ్ల నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు.
Tags:    

Similar News