ఒక్క గ్రామానికి పన్నెండు గ్రామాలు.. ఇదో చేదు నిజం..!

Update: 2021-03-24 12:30 GMT
పాకిస్థాన్​ మనదేశానికి దాయాది. ఒకప్పుడు భారత్​లో అంతర్భాగమే. కలిసి ఉంటే ఓ రాష్ట్రంలాగానే ఉండేది. కానీ వివిధ కారణాల ద్వారా పాకిస్థాన్​ ఇండియా నుంచి విడిపోయింది. విడిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్​ మనదేశం నుంచి విడిపోయినప్పటినుంచి భారత్​ మీద కక్ష సాధిస్తూ  ఉంది. మనదేశాధినేతలు ఎంతో ఓర్పుగా ప్రతి కవ్వింపును క్షమించినా పాకిస్థాన్​ మాత్రం మారదు. జమ్ము కశ్మీర్​లో అల్ల కల్లోలం సృష్టించడం, తీవ్ర వాదాన్ని పెంచి పోషించడం ఆ దేశానికి అలవాటు. ఇదిలా ఉంటే దేశ విభజన సమయంలో ఓకీలక ఘటన చోటుచేసుకున్నది.మనదేశం ఒక్క గ్రామం కోసం .. పాకిస్థాన్​కు 12 గ్రామాలను ఇచ్చేసింది. ఇది విషాదకరమైన సత్యం. అయితే మనదేశం అప్పుడు ఎందుకంత త్యాగం చేయాల్సి వచ్చిందో? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం.

 భారత్​​- పాక్​ సరిహద్దులో హుస్సేనివాలా అనే గ్రామం ఉంది. ఈ ఊరు ప్రస్తుతం పంజాబ్​ రాష్ట్రంలోని ఫిరోజ్​పూర్​ జిల్లాలో ఉంది. షాహీద్-ఎ-అజామ్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల సమాధులు ఈ గ్రామంలోనే ఉన్నాయి. భగత్ సింగ్ సహచరుడు బతుకేశ్వర్ దత్ సమాధి కూడా ఇక్కడ ఉంది. అలాగే, పంజాబ్ మాతా బిరుదు పొందిన భగత్ సింగ్ తల్లి విద్యావతి దేవి సమాధి కూడా ఈ గ్రామంలోనే ఉంది.

దేశ విభజన టైంలో ఈ గ్రామం పాకిస్థాన్​ పరిధిలోకి వెళ్లిపోయింది. అయితే ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గ్రామాన్ని తమకు వదిలేయాలంటూ భారత్​ విజ్ఞప్తి చేసింది.

అయితే పాకిస్థాన్​ ఇందుకు ఒప్పుకోకపోవడంతో.. మనదేశం ఆ ఒక్క గ్రామం కోసమే పన్నెండు గ్రామాలను పాకిస్థాన్​కు వదిలేసింది.

మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. వీరి త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామంలోనూ నిన్న నివాళి అర్పించారు.
బ్రిటీష్​ పాలనను వ్యతిరేకిస్తూ

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు నాటి కేంద్ర అసెంబ్లీలో బాంబులు విసిరారు. ఆ ఘటనలో ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన బ్రిటన్ ప్రభుత్వం.. వారికి మరణదండన వేసింది.

బ్రిటన్ అధికారులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల మృతదేహాలను ఎలాంటి సంప్రదాయాలను పాటించకుండా అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం వారి అవశేషాలను పక్కనే ప్రవహిస్తున్న సట్లేజ్ నదిలో పడేశారు.తదనంతర కాలంలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు సమాధులను హుస్సేనివాలాలో స్థాపించారు.దేశ విభజన సమయంలో ఈ గ్రామం పాకిస్థాన్​కు వెళ్లింది. ఈ చారిత్రక గ్రామాన్ని వదులుకొనే ఇష్టంలేని భారత్​ ఆ గ్రామం కోసం సులేమాన్​ సమీపంలో ఉన్న 12 గ్రామాలను పాకిస్తాన్‌ అప్పగించింది.
Tags:    

Similar News